MK Stalin | మోదీ, షా మాటలను నమ్మలేం.. డీలిమిటేషన్‌పై ఎంకే స్టాలిన్
MK Stalin | డీలిమిటేషన్ అంశంపై (Delimitation Bill) తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
MK Stalin | డీలిమిటేషన్ అంశంపై (Delimitation Bill) తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బిల్లు పాస్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
“కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజు. పునర్విభజనకు వ్యతిరేకంగా మనం చేసిన పోరాటాల ఫలితం ఏమిటో ఈరోజే మనకు తెలుస్తుంది. మన తీవ్ర వ్యతిరేకత, నిరసనల నేపథ్యంలో తమిళనాడు నియోజకవర్గాల సంఖ్యను తగ్గించబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న పార్లమెంటులో నోటిమాటగా హామీ ఇచ్చారు. మోదీ, షా మాటలను నమ్మలేం. వాళ్లు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు.
చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు. రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమే తప్ప.. దేశ ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు. దీన్ని మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. దీన్ని నమ్మలేము.. అంగీకరించలేము. ఈ బిల్లు ఒక భారీ కుట్రతో నిండి ఉంది. దీనిని తొందరపాటుతో ఆమోదించకూడదు. కేంద్ర ప్రభుత్వం దీనిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. తమకు ఉన్న మెజారిటీ బలంతో, మా వ్యతిరేకతను కాదని ఈ నల్లచట్టాన్ని ముందుకు తీసుకెళ్తే తమిళనాడులో వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.
Also Read..
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. గెజిట్ విడుదల చేసిన న్యాయశాఖ
కేంద్ర మంత్రితో బాలీవుడ్ నటి ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






