MK Stalin | మహిళా కోటాను ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది.. కేంద్రంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
MK Stalin | మహిళా రిజర్వేషన్ల (womens reservation Act) అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
MK Stalin | మహిళా రిజర్వేషన్ల (womens reservation Act) అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన (delimitation) ప్రక్రియను చేపట్టే ముందు.. విపక్షాలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ రిజర్వేషన్లను ఒక ఆయుధంలా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ.. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. "మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వారి ఆందోళన నిజమైనదే అయితే.. వారు దీనిని వెంటనే అమలు చేసి ఉండేవారు. అలా చేయకుండా.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన (delimitation) ప్రక్రియను చేపట్టే ముందు.. విపక్షాలను ఎదుర్కోవడానికి దీన్ని ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలని చూస్తోంది" అని అన్నారు. పునర్విభజనను సాకుగా చూపకుండా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతిపాదిత పునర్విభజన ప్రక్రియపై సీఎం స్టాలిన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల తమిళనాడు ప్రభావితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర హక్కుల కోసం మొట్టమొదట గళం విప్పింది డీఎంకేనే అని సీఎం గుర్తు చేశారు.
విజయం మాదే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని తమ కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎంకే స్టాలిన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి 200 కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రజామద్దతు, జనసందోహాన్ని చూస్తుంటే.. మొత్తం 234 నియోజక వర్గాల్లోనూ మా కూటమి విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా తమను ఓడించలేవని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల గురించి తమ కూటమికి ఆందోళన లేదని స్టాలిన్ పేర్కొన్నారు.
Also Read..
ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ - స్ట్రీమింగ్ డేట్..ప్లాట్‌ఫామ్ ఇవే
యుద్ధం ఉన్నా.. మ్యుచువల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు..
బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర: ఎర్రోళ్ల శ్రీనివాస్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



