Telugu OTT | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ – స్ట్రీమింగ్ డేట్..ప్లాట్‌ఫామ్ ఇవే
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Apr 11, 2026, 2.33 pm IST
Telugu OTT | పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ శనివారం ఖరారయ్యాయి. ఏప్రిల్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్....
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ సీనియర్ యాక్టర్ పార్తిబన్ విలన్‌గా నటించాడు.
మార్చి 26న థియేటర్లలోకి వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ ఇరవై రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఓజీ బ్లాక్‌బస్టర్ కారణంగా రిలీజ్‌కు ముందు ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలవడంతోనే తక్కువ టైమ్‌లోనే పవన్ కళ్యాణ్ మూవీ ఓటీటీలోకి వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
100 కోట్ల కలెక్షన్స్...
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ అందించారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మ్యానరిజమ్స్, ఓల్డ్ సినిమాల రిఫరెన్స్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ఫెయిలైంది.
సీఎంపై ఉస్తాద్ పోరాటం...
ఉస్తాద్ భగత్‌సింగ్ ఓ పోలీస్ ఆఫీసర్. నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుంటాడు. గంజాయి కోసం అడవికి వచ్చిన సీఎం చదలమర్రి నల్ల నాగప్ప కొడుకును భగత్ సింగ్ కిడ్నాప్ చేస్తాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన నల్లనాగప్పను భగత్ సింగ్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఐసీయూలో ఉన్న సీఎం చంద్రశేఖర్ రావుపై ఎటాక్ చేయించింది ఎవరు? భగత్ సింగ్ లైఫ్‌లోకి వచ్చిన శ్లోక, లీలా ఎవరు? సీఎం చంద్రశేఖర్‌రావుకు, భగత్‌సింగ్‌కు ఉన్న సంబంధమేమిటి అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



