త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఆసక్తికర ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త హోమ్‌స్క్రీన్ విడ్జెట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యాప్‌ను ఓపెన్ చేయకుండానే నేరుగా హోమ్‌స్క్రీన్ నుంచే వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసి పంపే అవకాశం ల‌భిస్తుంది.

S

Technology | Published On Jun 19, 2026, 1.12 pm IST

WhatsApp | వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..
Advertisement

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఆసక్తికర ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త హోమ్‌స్క్రీన్ విడ్జెట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యాప్‌ను ఓపెన్ చేయకుండానే నేరుగా హోమ్‌స్క్రీన్ నుంచే వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసి పంపే అవకాశం ల‌భిస్తుంది. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే ప్రముఖ ప్లాట్‌ఫామ్ WABetaInfo వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్ ను వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.24.2లో గుర్తించారు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉండగా, ఇంకా బీటా టెస్టర్లకు విడుదల కాలేదు. ఈ విడ్జెట్ ద్వారా వినియోగదారులు హోమ్‌స్క్రీన్‌పైనే వాయిస్ నోట్‌ను రికార్డ్ చేసి, రికార్డింగ్ పూర్తయ్యాక తమకు కావాల్సిన కాంటాక్ట్‌లకు నేరుగా పంపించుకోవ‌చ్చు. ప్రస్తుతం వాయిస్ మెసేజ్ పంపాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి, సంబంధిత చాట్‌లోకి వెళ్లి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఈ మొత్తం ప్రక్రియ మరింత వేగంగా మారనుంది.

ప‌రిమాణాన్ని మార్చ‌వ‌చ్చు..

లీకైన ప్రివ్యూ వివరాల ప్రకారం ఈ విడ్జెట్ మొదట 3x1 కాంపాక్ట్ ఫార్మాట్‌లో కనిపించనుంది. హోమ్‌స్క్రీన్‌లో ఉంచిన‌ తర్వాత అవసరానికి అనుగుణంగా దీని పరిమాణాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉండేలా వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ మరో ప్రయోజనం కూడా అందించ‌నుంది. ఒకే వాయిస్ మెసేజ్‌ను పలువురికి పంపాలనుకునే సందర్భాల్లో పదేపదే ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. రికార్డింగ్ చేసిన వెంటనే ఒకేసారి పలువురు యూజ‌ర్ల‌ను ఎంపిక చేసి పంపే అవకాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ విడ్జెట్ ద్వారా రూపొందించిన వాయిస్ రికార్డింగ్‌లను వాట్సాప్ స్టేటస్‌గా కూడా షేర్ చేసే అవకాశం ఉంటుంది. తరచూ వాయిస్ మెసేజ్‌ల ద్వారానే కమ్యూనికేట్ చేసే వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మార‌నుంది.

స్టేట‌స్‌ల కోసం మ‌రో విడ్జెట్‌..

ఇక వాట్సాప్ మరో హోమ్‌స్క్రీన్ విడ్జెట్‌పై కూడా పనిచేస్తోంది. స్టేటస్ అప్‌డేట్‌ల కోసం రూపొందిస్తున్న ఈ విడ్జెట్ ద్వారా తాజా స్టేటస్ కార్యకలాపాలను నేరుగా హోమ్‌స్క్రీన్‌లో చూడటంతోపాటు కొత్త స్టేటస్ పోస్ట్‌ను సృష్టించేందుకు షార్ట్‌కట్ ను కూడా అందించనున్నారు. అయితే ఈ ఫీచర్ కూడా ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. హోమ్‌స్క్రీన్ విడ్జెట్‌లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వినియోగదారులు యాప్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండానే తరచూ ఉపయోగించే ఫీచర్లను వేగంగా యాక్సెస్ చేయడానికి ఈ విడ్జెట్‌లు సహాయపడతాయి. ప్రస్తుతం స్టేటస్ విడ్జెట్, వాయిస్ మెసేజ్ విడ్జెట్ రెండూ అభివృద్ధి దశలో ఉండగా, వీటి విడుదలకు సంబంధించిన అధికారిక టైమ్‌లైన్‌ను వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు. భవిష్యత్ బీటా అప్‌డేట్‌లలో ఈ ఫీచర్లు ముందుగా అందుబాటులోకి వచ్చి, అనంతరం స్థిరమైన వెర్షన్‌లో ల‌భ్యం కానున్నాయి.

Advertisement
Advertisement