Crop Loan | రైతులకు గుడ్‌న్యూస్.. రూ. 75,000 వరకు పంట రుణాల మాఫీ
Crop Loan | తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) రైతులకు (Farmers) గుడ్ న్యూస్ చెప్పింది. సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ. 75,000 వరకు పంట రుణాలను (Crop Loan) పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రకటించారు.
Crop Loan | తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) రైతులకు (Farmers) గుడ్ న్యూస్ చెప్పింది. సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ. 75,000 వరకు పంట రుణాలను (Crop Loan) పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందనున్నారు. మే 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్య సహకార బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది.
ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000 వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు సమానంగా ఈ పథకం వర్తించనుంది. 8.33 లక్షల మంది సన్నకారు రైతులు, 5.16 లక్షల మంది చిన్న రైతులు, 93,548 మంది పెద్ద రైతులు ప్రయోజనం పొందనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రైతుల అవసరాలను అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ మాఫీ పథకం కింద సహకార బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను 45 నుంచి 60 రోజుల్లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5,932.23 కోట్ల వరకు అదనపు భారం పడనుందని అంచనా.
Also Read..
దగ్గు మందు విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
ప్రియుడితో బ్రేకప్ - ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
సంబంధిత వార్తలు

Tummala Nageshwar Rao | ఎల్ నినో ఎఫెక్ట్.. 13న ఇక్రిశాట్లో మంత్రి తుమ్మల సమీక్ష
జులై 12, 2026

KTR | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ..! సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 12, 2026

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
జులై 11, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



