త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లోయ‌లో ప‌డిపోయిన కారు.. ఏడుగురు మృతి

Road Accident | హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటు చేసుకుంది. చంబా జిల్లాలో ఓ కారు అదుపుత‌ప్పి లోయ‌లోకి ప‌డిపోయింది (car fell into a deep gorge).

D

National | Published On Jun 18, 2026, 12.51 pm IST

Road Accident | లోయ‌లో ప‌డిపోయిన కారు.. ఏడుగురు మృతి
Advertisement

Road Accident | హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటు చేసుకుంది. చంబా జిల్లాలో ఓ కారు అదుపుత‌ప్పి లోయ‌లోకి ప‌డిపోయింది (car fell into a deep gorge). ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చంబా-మస్రుంద్ జాతీయ‌ రహదారిపై (Chamba-Masrund road) గురువారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అధికారుల స‌మాచారం ప్ర‌కారం.. మహాలా పంచాయతీ పరిధిలోని సప్రోత్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కక్రోతా గ్రామంలో జరిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై తిరుగు ప‌య‌నమైంది. వీరు ప్ర‌యాణిస్తున్న బొలెరో వాహ‌నం చత్రుండ్ సమీపంలో అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లింది. 500 మీట‌ర్ల లోతైన లోయ‌లోకి ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో కారులోని ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు.

ప్ర‌మాద స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. తీవ్రంగా శ్ర‌మించి లోయ‌లో నుంచి ఏడుగురి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు విచార‌ణ ప్రారంభించారు.

Also Read..

ముడి చ‌మురు త‌గ్గినా.. ఇంధన ధరల‌ను వెంటనే తగ్గించలేం: కేంద్రం

రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!

లిస్టింగ్‌తో దూసుకెళ్లిన సుసాన్ ఎలక్ట్రికల్స్ షేర్.. పెట్టుబ‌డిదారుల‌కు భారీగా లాభం..

Advertisement
Advertisement