త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన మూడు తెలుగు సినిమాలు – ఒక్కోటి ఒక్కో జాన‌ర్‌

గురువారం ఒక్క‌రోజే మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ‌య్యాయి. ఇందులో రెండు సినిమాలు థియేట‌ర్ల‌ను స్క్రిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Jun 18, 2026, 4.10 pm IST

Telugu OTT |  ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన మూడు తెలుగు సినిమాలు – ఒక్కోటి ఒక్కో జాన‌ర్‌
Advertisement

Telugu OTT |  గురువారం ఒకే రోజు మూడు తెలుగు సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చాయి. క్రైమ్‌, మిస్ట‌రీ, కామెడీ క‌థాంశాల‌తో రూపొందిన ఆ సినిమాలు ఏవి? ఏ ఓటీటీలో రిలీజ‌య్యాయంటే?

జ‌య‌ముంది భ‌య‌మేలా మ‌న‌సా...

భ‌ర‌ణ్‌, ర‌వితేజ మ‌హాదాస్యం, రాజేష్ ఖ‌న్నా, శ‌ర‌ణ్య శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన జ‌య‌ముంది భ‌య‌మేలా మ‌న‌సా మూవీ గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ముగ్గురు స్నేహితులు క‌లిసి సైకిళ్ల‌పై హైద‌రాబాద్ నుంచి ముంబైకి ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఈ జ‌ర్నీలో వారికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఈ ప్ర‌యాణంలో వారి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లు, ఒక‌రి కోసం మ‌రొక‌రు చేసిన త్యాగాలేమిటి అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది. రంజిత్ పాశం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ థియేట‌ర్ల‌ను స్క్రిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి వ‌చ్చింది.

థాంక్యూ సుబ్బారావు....

ఓ పిట్ట‌క‌థ‌, అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో సినిమాల ఫేమ్ చందు ముద్దు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ సుబ్బారావు డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో చంద్ర‌హాస్ కోట్ల‌, లావ‌ణ్య జంట‌గా న‌టించారు. ఆరుగురు అమ్మాయిల హ‌త్య వెన‌కున్న చిక్కుముడిని ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఎలా ఛేదించాడ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

కానిస్టేబుల్‌....

వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ కానిస్టేబుల్ మూవీ స‌డెన్‌గా ఆహా ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌ధులిక హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో ముర‌ళీధ‌ర్ గౌడ్ కీల‌క పాత్ర పోషించారు. ఆర్య‌న్ సుభాన్ ఎస్‌కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
వీటితో పాటు దృశ్యం 3, అథిర‌ధి తో పాటు మ‌రికొన్ని త‌మిళ, మ‌ల‌యాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వ‌చ్చాయి.

 

Advertisement
Advertisement