త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Home Speaker | గూగుల్ హోమ్ స్పీక‌ర్ వ‌చ్చేసింది.. జెమినీ ఏఐతో అప్‌డేట్‌.. ధర ఎంతంటే..?

Google Home Speaker | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుత్ త‌న నూత‌న స్మార్ట్ స్పీక‌ర్ గూగుల్ హోమ్ స్పీక‌ర్‌కు గాను ఎంపిక చేసిన దేశాల మార్కెట్ల‌లో ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించింది. 2025 అక్టోబర్‌లో ఆవిష్కరించిన ఈ డివైస్‌లో జెమినీ ఫర్ హోమ్ వాయిస్ అసిస్టెంట్‌ను అందించారు.

S

Technology | Published On Jun 18, 2026, 1.02 pm IST

Google Home Speaker | గూగుల్ హోమ్ స్పీక‌ర్ వ‌చ్చేసింది.. జెమినీ ఏఐతో అప్‌డేట్‌.. ధర ఎంతంటే..?
Advertisement

Google Home Speaker | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుత్ త‌న నూత‌న స్మార్ట్ స్పీక‌ర్ గూగుల్ హోమ్ స్పీక‌ర్‌కు గాను ఎంపిక చేసిన దేశాల మార్కెట్ల‌లో ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించింది. 2025 అక్టోబర్‌లో ఆవిష్కరించిన ఈ డివైస్‌లో జెమినీ ఫర్ హోమ్ వాయిస్ అసిస్టెంట్‌ను అందించారు. ఆధునిక ఏఐ సామర్థ్యాలతో రూపొందించిన ఈ స్పీకర్ వినియోగదారులకు మరింత సహజమైన వాయిస్ అనుభవాన్ని అందిస్తుంది. గూగుల్ హోమ్ స్పీకర్ ధరను 99.99 డాలర్లు (సుమారు రూ.8,900)గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికా, న్యూజిలాండ్ సహా పలు మార్కెట్లలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. జూన్ 25 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది. ఈ స్పీకర్ బెర్రీ, హేజెల్, జేడ్, పోర్సిలైన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లభిస్తోంది. జెమినీ ఫర్ హోమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పీకర్ 360-డిగ్రీల ఆడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఇది గూగుల్ టీవీ స్ట్రీమర్‌తో కలిసి పనిచేస్తుంది. అలాగే రెండు స్పీకర్లను జత చేసి స్పేషియల్ సరౌండ్ సౌండ్‌తో చిన్న హోమ్ థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు.

ప్ర‌త్యేక‌మైన లైట్ రింగ్‌, జెమినీ లైవ్ యాక్సెస్‌..

స్పీకర్‌లో ప్రత్యేకమైన లైట్ రింగ్‌ను అమర్చారు. యూజ‌ర్‌ మాటలను జెమినీ వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు, సమాధానం ఇస్తున్నప్పుడు లేదా జెమినీ లైవ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఈ లైట్ డైనమిక్ గ్లోతో విజువల్ ఫీడ్‌బ్యాక్‌ను చూపిస్తుంది. వాయిస్ గోప్యత కోసం మైక్రోఫోన్‌ను వెంటనే మ్యూట్ చేసే టోగుల్ స్విచ్‌ను కూడా అందించారు. జెమినీ ఫర్ హోమ్ ఆధారిత ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఒకే కమాండ్‌లో పలు పనులను నిర్వహించవచ్చు. జెమినీ లైవ్ యాక్సెస్‌తోపాటు హోమ్ బ్రీఫ్స్ ఫీచర్ కూడా ఉంటుంది. యూజ‌ర్ ఇంటికి దూరంగా ఉన్న సమయంలో ఇంటి పరిసరాల్లో జరిగిన ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఇది అందిస్తుంది. గూగుల్ హోమ్ స్పీకర్‌లో క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తోపాటు ప్రత్యేక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ)ను అమర్చారు. ఇందులో 1జీబీ ర్యామ్‌, 4జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 58ఎంఎం ఫుల్-రేంజ్ డ్రైవర్‌తోపాటు మూడు ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్‌లను అందించారు.

అధునాత‌న క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు..

స్పీకర్‌లో కెపాసిటివ్ టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఇంట‌ర్న‌ల్‌ థ్రెడ్ 1.3 బోర్డర్ రౌటర్‌ను అందించారు. ఇది గూగుల్ హోమ్ ఎకోసిస్టమ్‌తో పనిచేయడమే కాకుండా, మ్యాటర్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ డివైస్‌లతో కూడా అనుసంధానమవుతుంది. డిజైన్ పరంగా ఈ స్పీకర్ కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని ఎత్తు 3.4 ఇంచులు కాగా వ్యాసం 4.2 ఇంచులుగా ఉంది. 30 వాట్ల యూఎస్‌బీ టైప్-సీ అడాప్టర్ ద్వారా పవర్ అందుతుంది.

Advertisement
Advertisement