Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు
Damodar Raja Narasimha | మంత్రి దామోదర రాజనర్సింహ శాడిస్ట్ అని.. నిజాలు బయటపెడితే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. మంత్రి దామోదర బావమరిది అనిల్‌రెడ్డి సింగూరు జలాశయంలోనే భూమి కబ్జా చేస్తున్నారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
- ఆయన బావమరిది అనిల్‌రెడ్డి సింగూరు జలాశయంలోనే భూ కబ్జా చేస్తున్నడు
- కలెక్టర్‌కు సాక్ష్యాధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు
- నిన్న మా కార్యకర్త అశోక్‌పై పోలీసులు దాడి చేశారు
- మంత్రికి చిత్రహింసలను వీడియో కాల్ ద్వారా పోలీసులు చూపించారు
- మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపణలు
Damodar Raja Narasimha | త్రినేత్ర.న్యూస్: మంత్రి దామోదర రాజనర్సింహ శాడిస్ట్ అని.. నిజాలు బయటపెడితే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. మంత్రి దామోదర బావమరిది అనిల్‌రెడ్డి సింగూరు జలాశయంలోనే భూమి కబ్జా చేస్తున్నారని.. కలెక్టర్‌కు సాక్ష్యాదారాలను అందించినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఫిర్యాదు చేస్తే ఎకరం మాత్రమే కబ్జా అయిందని అధికారులు అంటున్నారన్నారు. అనిల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలి..
అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం దగ్గర ఫాం హౌస్ ఉంది. నిజాం కాలంలో కట్టిన కుంటలను లెవెల్ చేసి కబ్జా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కలెక్టర్‌కు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారు. దీని పై కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలి. సింగూరు జలాశయానికే రక్షణ లేకపోతే సామాన్యుల భూములకు రక్షణ ఉంటుందా ? సోషల్ మీడియాలో వాస్తవాలు బయటపెడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారు. మంత్రి టార్చర్ తట్టుకోలేక నిన్న మా కార్యకర్త అశోక్‌పై మఫ్టీలో ఉన్న పోలీసులు దాడి చేశారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. మంత్రికి పోలీసులు చిత్రహింసలను వీడియో కాల్ ద్వారా చూపించారు. మేం ఆరుగంటల పాటు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండి ధర్నా చేస్తే గానీ అశోక్‌ను విడిచిపెట్టలేదు. మంత్రి దామోదర తన అరాచకాలను ఆపాలి. మంత్రి ఏది చెప్పినా తలూపుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు అని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు..
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. కేసీఆర్‌కు రైతుల దగ్గర ఉన్న పట్టును చూసి ఓర్వలేక రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. ధరలు భారీగా పెంచారు. కాంగ్రెస్ విప్‌లు విమర్శలకే పరిమితం అవుతున్నారు. కాంగ్రెస్ నాయకుల దగ్గర సరుకు లేదు సబ్జెక్టు లేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పని చేస్తారు. కేటీఆర్, హరీష్ రావులను విమర్శించే స్థాయి విప్ విజయ రమణ రావుకు లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మైకాసురులు, భూ బకాసురులుగా మారారు అని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



