Thalapathy Vijay Divorce | సీఎం విజయ్ విడాకుల కేసు మరోసారి వాయిదా – భర్తతో తెగతెంపులపై సంగీత యూటర్న్?
తమిళనాడు సీఎం దళపతి విజయ్ విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. సోమవారం విజయ్, సంగీతల విడాకుల కేసుపై సోమవారం చెంగల్పట్టు కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు విజయ్ హాజరుకాలేని పరిస్థితులు తలెత్తడంతో కేసును ఆగస్ట్ 7కు వాయిదా వేశారు.
Entertainment | Published On Jun 15, 2026, 11.46 am IST
Thalapathy Vijay Divorce |తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Thalapathy Vijay) విడాకుల కేసు మరోసారి వాయిదాపడింది. విజయ్, సంగీత విడాకుల కేసుపై సోమవారం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది.ఈ విడాకుల కేసును ఆగస్ట్ 7కు వాయిదా వేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు ప్రకటించింది. విజయ్ విచారణకు హాజరుకాలేని పరిస్థితులు తలెత్తడంతోనే వాయిదాపడినట్లు ప్రచారం జరుగుతోంది.
వీడియో కాన్ఫరెన్స్...
ఈ విడాకుల కేసులో నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విజయ్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. విజయ్ కోర్టుకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అన్నారు. కానీ ఫ్యామిలీ కోర్టు నిబంధలన ప్రకారం విడాకుల కేసులో కౌన్సిలింగ్‌కు దంపతులిద్దరూ హాజరుకావాల్సివుండటంతో విజయ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వ పాలన సంబంధమైన పనులతో బిజీగా ఉండి ఆయన విచారణకు హాజరుకాలేకపోయారని అంటున్నారు.
విడాకులపై యూటర్న్...
కాగా విడాకుల విషయంలో రాజీ పడాలని విజయ్, సంగీత నిర్ణయించుకున్నట్లు గత కొద్ది రోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. భర్తతో ఏర్పడిన మనస్పర్థలు, గొడవల విషయంలో వెనక్కి తగ్గాలని, మళ్లీ విజయ్‌తో కలిసి ఉండాలని సంగీత అనుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలను పరిష్కరించే దిశగా సంగీత తరఫు కుటుంబసభ్యులతో పాటు అటు విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రయత్నిస్తున్నారట. ఇటీవలే సంగీతను విజయ్ తల్లి శోభా కలిసినట్లు చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సంగీతతో చెప్పినట్లు సమాచారం. ఆమె కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందట. అందుకే ఈ విడాకుల కేసును ఆగస్ట్ ఏడుకు వాయిదా వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సంగీత, విజయ్ మళ్లీ కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
నటితో వేధింపులు...
కాగా విజయ్ నుంచి విడాకులు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఈ పిటిషన్‌లో పేర్కొన్నది. ఆ నటి త్రిషనే అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అటు సీఎం విజయ్‌తో పాటు ఇటు త్రిష ఈ రూమర్లపై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Udhayanidhi Stalin | త్రిషపై అసభ్యకర కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
ఆగస్టు 4, 2026

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026

Vijay Trisha | విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ 21 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ – తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే డిజాస్టర్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ



