Vivek Venkataswamy | ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. కాళేశ్వరం: మంత్రి వివేక్
Vivek Venkataswamy | కాళేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశమన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
- ఎంపీ వంశీకృష్ణతో కలిసి సరస్వతి అంత్య పుష్కర స్నానం ఆచరించిన వివేక్
- అనంతరం స్వామివారిని దర్శించుకున్న నేతలు
Vivek Venkataswamy | త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సోమవారం ఆయన పెద్ద పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. ఈ పుష్కరాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో పాటు భాజా భజంత్రీల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో, వేద పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు పుష్కరాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





