Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లాంఛింగ్ డేట్ కన్ఫామ్ – హౌజ్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వీళ్లే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లాంఛ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ కొత్త సీజన్ మొదలుకాబోతున్నట్లు నాగార్జున ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సారి డ్రామా, సర్‌ప్రైజ్‌లు పదింతలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
Entertainment | Published On Aug 29, 2026, 3.37 pm IST
Bigg Boss 10 Telugu | తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాలిటీ షోస్‌లో ఒకటిగా బిగ్‌బాస్ నిలిచింది. బిగ్‌బాస్‌లో ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు వచ్చాయి. టీఆర్‌పీ రేటింగ్ పరంగా ప్రతి సీజన్ రికార్డులు క్రియేట్ చేసింది. ఆడియెన్స్‌లో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నాగార్జున హోస్ట్...
తాజాగా బిగ్‌బాస్ సీజన్ 10 లాంఛింగ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ కొత్త సీజన్ మొదలుకాబోతుంది. బిగ్‌బాస్ 10కు మరోసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మాలో బిగ్‌బాస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
సర్‌ప్రైజ్‌లు....
బిగ్‌బాస్ 10 లాంఛ్ డేట్‌ను శనివారం ఓ వీడియో ద్వారా నాగార్జున అనౌన్స్ చేశారు. మీరు ఎంతైనా ఎక్స్‌పెక్ట్ చేయండి. బిగ్‌బాస్ సీజన్ 10 నెక్స్ట్ లెవెల్. వెరైటీ, సర్‌ప్రైజ్‌లు, డ్రామా పదింతలు ఉంటాయి. వారం వారం సరికొత్త అవతారం. ఈ సారి ఆటలో సవాల్ కాదు. ఆటే సవాల్ అని నాగార్జున ఈ వీడియోలో ప్రకటించారు. సెప్టెంబర్ 6న సాయంత్రం ఏడు గంటలకు బిగ్‌బాస్ సీజన్ 10 మొదలుకాబోతున్నట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
అగ్నిపరీక్ష....
బిగ్‌బాస్ సీజన్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పాల్గొన్న పదిహేను మంది నుంచి నలుగురు మాత్రమే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఝాన్సీ పేరు ఖాయమైంది. మిగిలిన ముగ్గురు ఎవరన్నది ఉత్కంఠను పంచుతోంది.
గుప్పెడంత మనసు రిషి...
పలువురు టీవీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడతో పాటు యాంకర్ వర్షిణి, సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్‌తో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు టీవీ నటి చైత్రరాయ్, జబర్ధస్థ్ షో నుంచి నూకరాజు , రాకింగ్ రాకేష్ , హరి , జబర్దస్త్ రాంప్రసాద్ పొట్టి నరేష్‌లలో ఒకరి లేదంటే ఇద్దరికి ఛాన్స్ దక్కనున్నట్లు చెబుతున్నారు. అలాగే తేజస్విని గౌడ, ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, ప్రేమదేశం హీరో అబ్బాస్, సీనియర్ యాక్టర్ కృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరు ఉంటారో...ఎవరి ఉండరన్నది సెప్టెంబర్ 6న రివీల్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ – షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!
సెప్టెంబర్ 5, 2026

Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
సెప్టెంబర్ 2, 2026

Telugu Serials | బిగ్‌బాస్ ఎఫెక్ట్ – ఇల్లు ఇల్లాలు పిల్లలు, పొదరిల్లు సీరియల్స్ టైమ్ ఛేంజ్
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



