Mamata Banerjee | కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర మమతా బెనర్జీ (Mamata Banerjee)పై కోల్‌కతా పోలీసులు (Kolkata Police) ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
Mamata Banerjee | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర మమతా బెనర్జీ (Mamata Banerjee)కి గట్టి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం సువేందు అధికారి ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసులు (Kolkata Police) దీదీపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న రాజధాని కోల్‌కతా నగరంలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో దీదీ సైతం పాల్గొన్నారు. అయితే, కేథడ్రల్ రోడ్డులో నిర్వహించిన ఈ ర్యాలీకి కోల్‌కతా హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అందులో ముఖ్యంగా రహదారిపై ఒక వైపు పూర్తిగా వాహనాల రాకపోకలకు వదిలిపెట్టాలని ఆదేశించింది. మరో లేన్‌లో మాత్రమే ర్యాలీ నిర్వహించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ర్యాలీ నిర్వాహకులు రెండు లేన్లను దిగ్బంధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. కోర్టు ఆదేశాలను టీఎంసీ ఉల్లింఘించినట్లు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు దీదీపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ కార్యక్రమం కోసం హైకోర్టు నిర్దేశించిన సమయ పరిమితిని కూడా దాటినట్లు పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని నాజిల్స్‌పై ప్రదర్శించాలి
శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది - దేవీశ్రీప్రసాద్‌కు జోడీగా మ్యాడ్ బ్యూటీ!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






