Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్‌లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah | నియంత్రణ రేఖ అవతలివైపు ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అన్నారు. 2019లో కేంద్రం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టిక్ 370 రద్దు చేయకపోయి ఉంటే.. పీవోకే ప్రజలు జమ్ము కశ్మీర్‌లో కలిసిపోయేందుకు ఎప్పుడో ఉద్యమించేవారని వ్యాఖ్యానించారు.
Omar Abdullah | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను తొలగించకపోయి ఉంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజలు జమ్ము కశ్మీర్‌లో విలీనం అయ్యేందుకు ఎప్పుడో ఉద్యమించేవారని అన్నారు.
శ్రీనగర్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) కార్యక్రమంలో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టిక్ 370 రద్దు గురించి ప్రస్తావించారు. పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఎందరో జైళ్లలో మగ్గడం తనను తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. 1947లో పాకిస్థానీ దురాక్రమణ దాడులను ఎదుర్కొని భారత్‌లో కలవాలని మన పూర్వీకులు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో పీవోకేలోని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి ఉండకపోయి ఉంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజలు జమ్ము కశ్మీర్‌లో విలీనం అయ్యేందుకు ఎప్పుడే ఉద్యమించే వారని అన్నారు.
ప్రస్తుతం నియంత్రణ రేఖ (LoC) అవతలి వైపు ఉన్న పీవోకే ప్రజల పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా, ఆందోళనకరంగా ఉందన్నారు. పీవోకే ప్రజలు ఎప్పటికైనా జమ్ము కశ్మీర్‌లో కలిసిపోతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి కోసం అసెంబ్లీలో సీట్లు ఖాళీగా ఉంచుతున్నామని సీఎం తెలిపారు. ఎప్పటికైనా ఆ ఖాళీ సీట్లు నిండుతాయన్న ఆశతో ఉన్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. 2019లో ప్రభుత్వం రద్దు చేసిన జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఇతర రాజ్యాంగపరమైన హామీల పునరుద్ధరించే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.
Also Read..
రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
- ●CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
- ●Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..
- ●CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్






