X | ఎక్స్‌లో కొత్త అప్‌డేట్.. ఇక కావల్సిన టాపిక్‌లనే ఫాలో అవ్వచ్చు..
X | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన అంశాల ఆధారంగా ఏఐ సాయంతో ప్రత్యేక టైమ్‌లైన్స్‌ను రూపొందించుకోవచ్చు. టైమ్ లైన్ అంటే ఏదైనా ఒక అంశానికి చెందిన విభాగం.
Technology | Published On Aug 29, 2026, 3.39 pm IST
X | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన అంశాల ఆధారంగా ఏఐ సాయంతో ప్రత్యేక టైమ్‌లైన్స్‌ను రూపొందించుకోవచ్చు. టైమ్ లైన్ అంటే ఏదైనా ఒక అంశానికి చెందిన విభాగం. యూజర్లు ఎక్స్‌లో సాధారణంగా అనేక మంది సెలబ్రిటీలు, మీడియా సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇతర అఫిషియల్ పేజీలను ఫాలో అవుతుంటారు. ఇవన్నీ భిన్న రంగాలకు చెందినవి అయి ఉంటాయి. అయితే ఏదైనా ఒక ప్రత్యేక రంగానికి చెందిన ఫీడ్ కావాలంటే ఇప్పటి వరకు ఎక్స్‌లో ఆప్షన్ అందుబాటులో లేదు. అంటే ఉదాహరణకు స్పోర్ట్స్, టెక్నాలజీ, బిజినెస్, వినోదం వంటి విభాగాలకు చెందిన ఫీడ్స్ మాత్రమే టైమ్‌లైన్‌లో కనిపించాలంటే సదుపాయం లేదు. కానీ ఇప్పుడు అదే సదుపాయాన్ని టైమ్‌లైన్ పేరుతో ఎక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్ ఫాలో అయ్యే పేజీలలోని ఒకే రంగానికి చెందిన ఫీడ్స్‌ను ఒకే టైమ్ లైన్‌లో ప్రత్యేక సెక్షన్‌లో చూపిస్తుంది. దీంతో ఏ రంగం పట్ల ఆసక్తి ఉందో ఆ రంగానికి చెందిన ఫీడ్‌లను మాత్రమే యూజర్లు టైమ్‌లైన్‌లో పొందుతారు.
ఎవరికి అందుబాటులో..?
కాగా ప్రస్తుతం ఈ సదుపాయం పెయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితం కాగా, తొలుత ఐఓఎస్ డివైస్‌లలో అందుబాటులోకి వస్తోంది. యాప్‌లో వ్యక్తిగతీకరణతో పాటు వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించడంపై కంపెనీ దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం యాప్‌లతోపాటు వెబ్ వెర్షన్‌లోనూ దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త కస్టమ్ టైమ్‌లైన్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు ఆసక్తి ఉన్న నిర్దిష్ట అంశాలను నేరుగా హోమ్ ఫీడ్‌లో పిన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ఫర్ యూ, ఫాలోయింగ్ ట్యాబ్‌లపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా డిజైన్, రోబోటిక్స్, రియల్ ఎస్టేట్ వంటి అంశాల కోసం ప్రత్యేక స్ట్రీమ్‌లను సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం 75కుపైగా అంశాలకు ఈ ఫీచర్ మద్దతు ఇస్తోంది.
టైమ్ లైన్స్‌ను నిర్వహించే గ్రోక్ ఏఐ..
ఈ కస్టమ్ టైమ్‌లైన్స్‌ను గ్రోక్ ఏఐ నిర్వహిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన, పోస్టులతో వారి ఎంగేజ్‌మెంట్ విధానాలను గ్రోక్ విశ్లేషించి కంటెంట్‌ను ఎంపిక చేస్తుంది. వినియోగదారులు ఎలాంటి అంశాలకు సంబంధించిన పోస్టులను చూస్తున్నారు, వాటితో ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలను గుర్తించి, కాలక్రమేణా సిఫార్సులను మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న వినియోగదారులకు ఇప్పటికే ఉన్న ట్యాబ్‌ల పక్కన యాడ్ (+) బటన్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి కొత్త టైమ్‌లైన్స్‌ను రూపొందించడంతో పాటు వాటిని నిర్వహించుకోవచ్చు. డిఫాల్ట్ అల్గారిథమ్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా, తమ ఫీడ్‌లో ఏ కంటెంట్ కనిపించాలనే విషయంపై వినియోగదారులకు మరింత ప్రత్యక్ష నియంత్రణ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం.

అవసరం ఉన్న కంటెంట్ మాత్రమే..
కస్టమ్ టైమ్‌లైన్స్‌తోపాటు నిర్దిష్ట అంశాలను తాత్కాలికంగా దాచుకునే మరో సదుపాయాన్ని కూడా ఎక్స్ తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ ఫర్ యూ ట్యాబ్‌కు వర్తిస్తుంది. రాజకీయాలు, క్రీడలు వంటి కొన్ని కంటెంట్ విభాగాలను కొంతకాలం పాటు దాచుకోవడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. తద్వారా తమకు ఆసక్తి లేని కంటెంట్‌ను తగ్గించుకుని, మరింత సంబంధిత పోస్టులను ఫీడ్‌లో పొందవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఎక్స్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అదికూడా ఐఓఎస్ డివైస్‌లలో తొలుత విడుదల చేస్తున్నారు. ఆండ్రాయిడ్ డివైస్‌లకు కూడా ఈ సదుపాయాన్ని తర్వాత తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఉచితంగా ఎక్స్‌ను ఉపయోగించే వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందిస్తారా లేదా అనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
సోషల్ మీడియా కంటెంట్‌లో ఏఐ వినియోగం..
ఏఐ ఆధారిత టైమ్‌లైన్స్ పరిచయం ద్వారా ఎక్స్ తన వేదికలో మరింత లోతైన వ్యక్తిగతీకరణ దిశగా అడుగులు వేస్తోంది. వినియోగదారులు స్వయంగా ఎంచుకునే అంశాలను ఏఐ ఆధారిత ఫిల్టరింగ్‌తో కలిపి, అల్గారిథమ్ సిఫార్సులతో పాటు మాన్యువల్ నియంత్రణను కూడా అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్‌ను ఎలా కనుగొంటున్నారు, ఎలా వినియోగిస్తున్నారు అనే అంశాల్లో గ్రోక్ వంటి ఏఐ వ్యవస్థల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఆ విషయాన్ని ఈ ఫీచర్ స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు






