Climate Change | హిమాలయాలకు ముప్పు
Climate Change | హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న మంచు కురిసే తీరుతెన్నులు, వేగంగా కరుగుతున్న హిమానీనదాలతో జలభద్రతకు ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల ముప్పూ పెరుగుతోందని తాజాగా ప్రచురితమైన శాస్త్రీయ అధ్యయనం హెచ్చరించింది.
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- కరుగుతున్న మంచుతో జలభద్రతకు సవాల్
- పశ్చిమ హిమాలయాల్లోనూ ఆకస్మిక వరదల ప్రమాదం
Climate Change | హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న మంచు కురిసే తీరుతెన్నులు, వేగంగా కరుగుతున్న హిమానీనదాలతో జలభద్రతకు ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల ముప్పూ పెరుగుతోందని తాజాగా ప్రచురితమైన శాస్త్రీయ అధ్యయనం హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ సహా పశ్చిమ హిమాలయ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1901 నుంచి 2020 వరకు హిమాలయాల్లో ఉష్ణోగ్రత, మంచు విస్తీర్ణంలో చోటుచేసుకున్న మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. క్లైమాటిక్ రీసెర్చ్ యూనిట్ (సీఆర్‌యూ) గణాంకాలతో పాటు సీఎంఐపీ6 వాతావరణ నమూనాల ఆధారంగా చారిత్రక పరిణామాలు, భవిష్యత్ పరిస్థితులను అంచనా వేశారు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు ప్రస్తుత అధిక స్థాయిలోనే కొనసాగితే గ్రేటర్ హిమాలయాలు, ట్రాన్స్ హిమాలయాల్లో శతాబ్దం చివరినాటికి ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతోపాటు మంచు, హిమ విస్తీర్ణంలో భారీ మార్పులు సంభవించే అవకాశముందని అధ్యయనం వెల్లడించింది.
పశ్చిమ హిమాలయాలకూ..
హిమానీనదాలు కరుగుతూ వాటి సమీపంలో ఏర్పడే సరస్సుల్లో నీరు భారీగా చేరి, ఒక్కసారిగా ఆనకట్టలా ఉన్న అడ్డంకులు తెగిపోతే దిగువ ప్రాంతాల్లో విధ్వంసకర వరదలు సంభవిస్తాయి. వీటిని గ్లేషియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (జీఎల్‌ఓఎఫ్)గా పిలుస్తారు. తూర్పు హిమాలయాలు ఈ ముప్పుకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఇప్పటివరకు భావించగా.. వాతావరణ మార్పులతో ఈ ప్రమాద పరిధి పశ్చిమ హిమాలయాలకూ విస్తరించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. మెరుగైన వాతావరణ అంచనా నమూనాలు, ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హిమానీనదాలు, కాలానుగుణ మంచు కురుపై క్షేత్రస్థాయి అధ్యయనాలను విస్తరించడంతోపాటు ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
15వేలకుపైగా హిమానీనదాలు
హిమాలయాల్లో 15 వేలకుపైగా హిమానీనదాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. దక్షిణాసియాలోని కోట్లాది ప్రజలకు అవసరమైన నీటి వనరులకు ఇవి కీలక ఆధారం. హిమానీనదాల కరుగుదల వేగం పెరిగితే భవిష్యత్తులో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు స్థానికంగా విపత్తు నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధ్యయనం సూచించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?
- ●Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్
- ●Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
- ●Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్
- ●Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?

Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్

Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..

Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్






