E20 Petrol | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని నాజిల్స్‌పై ప్రదర్శించాలి
E20 Petrol | దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లోని డిస్పెన్సింగ్ నాజిల్స్‌పై (Dispensing Nozzles) పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ ఖచ్చితమైన శాతాన్ని విధిగా ప్రదర్శించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme Court) ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
E20 Petrol | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని (Ethanol Percentage) తప్పనిసరిగా వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది. న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాళేలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 31న విచారించనుంది.
పెట్రోల్ పంపుల్లోని ప్రతి డిస్పెన్సింగ్ నాజిల్స్ (Dispensing Nozzles)పైనా పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ కచ్చితమైన శాతాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు, వినియోగదారులకు ఇచ్చే ప్రతి ఫ్యూయల్ ఇన్‌వాయిస్‌పై కూడా ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ముద్రించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తయారీదారు, మోడల్, ఇంజిన్ రకం, తయారైన సంవత్సరం ఆధారంగా ఏ వాహనానికి ఏ ఇథనాల్ మిశ్రమం సరిపోతుందో తెలిపే అధికారిక, పబ్లిక్ వెహికల్ కంప్యాటిబిలిటీ డేటాబేస్‌ను నిర్దిష్ట కాలపరిమితిలోగా రూపొందించి ప్రచురించాలని కోరారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ20 ఇథనాల్ వాడకంపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల ఇంజన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో E20 ఇంధన వాడకం వల్ల ప్రస్తుత వాహనాలపై పడే ప్రభావం, ఇంధన సామర్థ్యం (Fuel Efficiency), నిర్వహణ ఖర్చులు, వారంటీ, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల పర్యావరణం, నీటి వినియోగం, ఆహార భద్రతపై తలెత్తే ఆందోళనలపై ఈ కమిటీ నివేదిక ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
Also Read..
శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
సంబంధిత వార్తలు

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 10, 2026

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
సెప్టెంబర్ 9, 2026

Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు



