త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Quiz Competition | కౌన్ బ‌నేగా త‌ర‌హాలో యువ‌త‌కు క్విజ్ పోటీ.. విజేత‌కు రూ.కోటి బ‌హుమ‌తి

Quiz Competition | పంజాబ్‌లోని భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎన్నిక‌ల వేళ యువ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ‘పంజాబ్ దా క‌రోడ్‌ప‌తి’ (Punjab Da Crorepati) పేరుతో క్విజ్ పోటీలు (Quiz Competition) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. విజేత‌గా నిలిచిన వారికి ఏకంగా రూ.కోటి బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం భ‌గ‌వంత్ మాన్ ప్ర‌క‌టించారు.

D

National | Published On Nov 14, 2026, 5.38 pm IST

Quiz Competition | కౌన్ బ‌నేగా త‌ర‌హాలో యువ‌త‌కు క్విజ్ పోటీ.. విజేత‌కు రూ.కోటి బ‌హుమ‌తి
Advertisement

Quiz Competition | త్రినేత్ర న్యూస్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాత్మక చర్యల్లో భాగంగా పంజాబ్‌లోని భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో యువ‌త‌కు క్విజ్ పోటీలు (Quiz Competition) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘పంజాబ్ దా క‌రోడ్‌ప‌తి’ (Punjab Da Crorepati) పేరుతో ఈ క్విజ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఈ పోటీలో విజేత‌గా నిలిచిన వారికి ఏకంగా రూ.కోటి బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం భ‌గ‌వంత్ మాన్ ప్ర‌క‌టించారు. పంజాబ్ చ‌రిత్ర‌, సంస్కృతి, భౌగోళిక ప‌రిస్థితులు, గ‌ణితం, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుకు సంబంధించి వివిధ అంశాల‌పై ప్ర‌శ్న‌లు ఉంటాయ‌ని తెలిపారు. 15-30 సంవ‌త్స‌రాల‌ వ‌య‌స్సు గ‌ల యువ‌తీ యువ‌కులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హుల‌ని పేర్కొన్నారు.

సీఎం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ పోటీలో మొత్తం 11 రౌండ్లు ఉంటాయి. వీటిలో తొమ్మిది రౌండ్లు ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించ‌నుండ‌గా.. మ‌రో రెండు రౌండ్లు ప్ర‌త్య‌క్షంగా జ‌రుగుతాయి. 10వ రౌండ్‌ను రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారు గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైన‌ల్‌లో విజేత‌ను ప్ర‌క‌టిస్తారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టీవీ క్విజ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి (Kaun Banega Crorepati) త‌ర‌హాలోనే ఇందులో ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు నాలుగు ఆప్ష‌న్లు ఇస్తారు.

పోటీలో సుమారు 50,000 ప్రశ్నల నిధి ఉంటుంది. వీటిలో ఎక్కువ భాగం కానిస్టేబుల్, పట్వారీ, PCS వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అడిగే ప్ర‌శ్న‌ల ఆధారంగా ఉంటాయ‌ని సీఎం వివ‌రించారు. ఈ పోటీలో పాల్గొన్న మొత్తం 10,000 మందికి బహుమతులు అందజేయనున్నారు. విజేత‌కు రూ.కోటి బ‌హుమ‌తి గెలుచుకునే అవ‌కాశం ఉంటుంది. నలుగురు రన్నరప్స్‌లో ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు విద్యార్థుల పేర్ల‌ను న‌మోదు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

Also Read..

‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు గిరిబాబు క‌న్నుమూత - హీరోగా తొలి ఛాన్స్ - విల‌న్‌గా ఫేమ‌స్‌

టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ కోరిక నెర‌వేర్చిన రాహుల్ గాంధీ

Advertisement
Advertisement