Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ
Cyclone | ఇటీవల వరుస తుపాన్లు పలు రాష్ట్రాలను వణికించాయి. ముఖ్యంగా ఏపీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. తాజాగా మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
- 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం..
- నవంబర్ 16 సాయంత్రానికి తుపానుగా బలపడే ఛాన్స్..
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు
Cyclone | ఇటీవల వరుస తుపాన్లు పలు రాష్ట్రాలను వణికించాయి. ముఖ్యంగా ఏపీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. తాజాగా మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి నవంబర్ 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం వరకు తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేసింది.
నవంబర్ 17 నుంచి గంటకు భారీ గాలులు...
ఈ నెల 17 నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్ 15లోగా తీరానికి చేరుకోవాలని ఐఎండీ హెచ్చరించింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
వరుసగా మూడో తుపాను..
ఇటీవలి వారాల్లో బంగాళాఖాతం ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న మూడో తుపాను కావడం విశేషం. గతంలో అక్టోబర్‌లో అర్ణబ్, నవంబర్‌లో మురాసు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటాయి. అక్టోబర్ 28న నర్సాపూర్ సమీపంలో అర్ణబ్ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రికార్డయ్యాయి. ఈ తుపాను కారణంగా కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నవంబర్ 3 తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో మురాసు తుపాను తీవ్ర తుపానుగా దక్షిణ ఏపీలో తీరాన్ని దాటింది. గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా.. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు నమోదయ్యాయి. ఈ తుపాను ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా మరో అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయని.. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
నవంబర్ 14, 2026

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
నవంబర్ 14, 2026

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ
- ●CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
- ●Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
- ●Quiz Competition | కౌన్ బనేగా తరహాలో యువతకు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి

Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్



