త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి

Deeksha Divas Meeting | న‌వంబ‌ర్ నెల అంటేనే కేసీఆర్ (KCR) ఆమ‌ర‌ణ దీక్ష (Indefinite Hunger Strike) గుర్తొస్తుంద‌ని.. 50 ఏండ్ల ద‌రిద్రాన్ని వ‌దిలించుకున్న రోజని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు (BRS Leaders) అన్నారు.

S

Telangana | Published On Nov 14, 2026, 5.39 pm IST

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
Advertisement
  • 50 ఏండ్ల దరిద్రాన్ని వదిలించుకున్న రోజే నవంబర్ 29
  • దీక్షా దివ‌స్ గురించి చాలా మందికి తెలియాల్సి ఉంది
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్‌ మాజీ మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు

Deeksha Divas Meeting | త్రినేత్ర న్యూస్: న‌వంబ‌ర్ నెల అంటేనే కేసీఆర్ (KCR) ఆమ‌ర‌ణ దీక్ష (Indefinite Hunger Strike) గుర్తొస్తుంద‌ని.. 50 ఏండ్ల ద‌రిద్రాన్ని వ‌దిలించుకున్న రోజని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు (BRS Leaders) అన్నారు. ఈనెల 29న క‌రీంన‌గ‌ర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరులో దీక్షా దివ‌స్ (Deeksha Divas Meeting)  బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌బోతున్నామ‌ని చెప్పారు. కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌తోనే ఢిల్లీ దిగొచ్చింద‌ని పున‌రుద్ఘాటించారు. కేసీఆర్ స‌చ్చుడో.. తెలంగాణ వ‌చ్చుడో అనే నినాదం మ‌నంద‌రికీ స్ఫూర్తి కావాల‌న్నారు. దీక్షా దివ‌స్ విష‌యం ఇంకా చాలా మంది ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌ర‌లొచ్చి స‌భ‌ను స‌క్సెస్ చేయాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, జీవ‌న్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడారు.

నవంబర్ 29 తేదీ 40 , 50 ఏండ్ల దరిద్రాన్ని వదిలించుకున్న రోజు. చరిత్ర మలుపు తిరిగిన రోజు. ఆరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆమరణ దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను అరెస్ట్ చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయ‌కపోతే ఢిల్లీ దిగి వచ్చేది కాదు. ఈనెల 29న అలుగునూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా మొత్తం అట్టహాసంగా సంబరాలు చేయ‌బోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కారణమే కేసీఆర్. తెలంగాణ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలి అని గంగుల కోరారు.

నవంబర్ నెల అనగానే తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష గుర్తొస్తుంది. దీక్షా దివ‌స్‌తో కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచాడు. దీక్షా దివ‌స్‌ను మరోసారి స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. దీక్షా దివ‌స్ బహిరంగ సభకు కేటీఆర్ హాజర‌వుతారు. సభను సక్సెస్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అని ర‌స‌మ‌యి అన్నారు.

తెలంగాణ ఏర్పాటులో సోనియాది పెద్ద పాత్ర

దీక్షా దివ‌స్ సందర్భంగా ఈ నెల 29న అలుగునూరులో భారీ బహిరంగ సభ నిర్వ‌హిస్తాం. క్విట్ ఇండియా నినాదం మనందరికీ ఒక స్ఫూర్తి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో మనందరికీ స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరా గాంధీ అణిచివేసింది. సీమాంధ్రులు అనేక కుటిల రాజకీయాలు చేశారు. అలాంటి సమయంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చాడో నిర్ణయం ఎంతో మేలు చేసింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో యావత్ తెలంగాణ ఒక తాటిపైకి వచ్చింది. ఆమరణ దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను అరెస్ట్ చేశారు. ఖమ్మం జైల్లో నిర్బంధించారు. నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ ను తరలించాలని డిమాండ్ చేశాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆందోళనలు జ‌రిగాయి.

డిసెంబర్ 9న‌ తెలంగాణ పక్రియ మొదలవుతుందనని ప్రకటన వ‌చ్చింది. సీమాంధ్రుల కుటిల రాజకీయాలకు చిదంబరం ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్నప్పుడు అందరూ ఏక‌మ‌య్యారు. జేఏసీ (JAC) లు అప్పుడే మొదలయ్యాయి. ఆ తర్వాత పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. అందుకే ఈనెల 29న‌ అలుగునూరులో భారీ బహిరంగ సభ పెట్ట‌బోతున్నం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీది చాలా పెద్ద పాత్ర. సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన రాలేదు. ఇదే విషయం నేను ట్వీట్ చేశాను. కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ జరుగుతుంది అని వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు.

తుపాకీ ప‌ట్టుకొని వెళ్లిన వ్య‌క్తి ఆయ‌న‌..

నవంబర్ 29 రోజు చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంటుంది. నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ గళం విప్పారు. దీక్షా దివ‌స్ గురించి చాలా మందికి తెలియాల్సి ఉంది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పట్టుకొని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం అని కొప్పుల ఈశ్వ‌ర్ వాపోయారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టాడు. కేసీఆర్ ఆమరణ దీక్షతో చిదంబరం ప్రకటన చేశాడు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించాం. నవంబర్ 29 దీక్షా దివ‌స్ రాష్ట్రం మొత్తం నిర్వహించుకుంటున్నాం. అలుగునూరు బహిరంగ సభకు కేటీఆర్ హాజర‌వుతారు. సభను సక్సెస్ చేయాలి అని జీవ‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

కామన్ మినిమం పోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగాడు. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆమరణ దీక్ష చేప‌ట్టాడు. అలుగునూరు వద్ద దీక్ష చేస్తున్న కేసీఆర్ అరెస్ట్ చేశారు. కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. అలుగునూరు భారీ బహిరంగ స‌భ‌ను సక్సెస్ చేయాలి అని ఎమ్మెల్సీ ఎల్ ర‌మ‌ణ కోరారు.

ఈ స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవి శంకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవీందర్ సింగ్, చిరుమళ్ల రాకేష్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్‌ప‌ర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement