త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk | రెండు రోజుల్లో చ‌నిపోవ‌చ్చు.. వాంగ్‌చుక్‌ను ర‌క్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లు

Sonam Wangchuk | నీట్‌ పేపర్ లీక్, పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌డుతున్న ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యం క్షీణించింది. ఆయ‌న మ‌రో రెండు రోజుల్లో చ‌నిపోయే ప్ర‌మాదం ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది.

D

National | Published On Jul 15, 2026, 4.23 pm IST

Sonam Wangchuk | రెండు రోజుల్లో చ‌నిపోవ‌చ్చు.. వాంగ్‌చుక్‌ను ర‌క్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లు
Advertisement

Sonam Wangchuk | నీట్ ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు నిర‌స‌న‌గా ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేప‌ట్టిన ఆమ‌ర‌ణ‌ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. ఈ 17 రోజులూ ఆయ‌న ఆహారం తీసుకోక‌పోవ‌డంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న్యాయ‌వాది రాకేష్ కుమార్ సైని (Rakesh Kumar Saini) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌కు త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించాల‌ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యం దాఖ‌లు చేశారు.

నీట్‌ పేపర్ లీక్, పరీక్షల్లో జరిగిన అక్రమాలకు (NEET 2026 examination) బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. వాంగ్‌చుక్ జూన్‌ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో గ‌త 17 రోజులుగా ఆయ‌న ఆహారం తీసుకోక‌పోవ‌డంతో ఆరోగ్యం క్షీణించింది. ప్ర‌స్తుతం ఆయ‌న 8 కేజీల బ‌రువు త‌గ్గార‌ని, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా త‌గ్గాయ‌ని స‌ద‌రు న్యాయ‌వాది త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. తీవ్ర నీరసం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. మ‌రో రెండు రోజుల్లో వాంగ్‌చుక్‌ చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వెంటనే జోక్యం చేసుకుని ఆయనను రక్షించాల‌ని కోరారు. బ‌ల‌వంతంగానైనా ఆయ‌న‌కు ఆహారం అందించ‌డంతోపాటూ అవ‌స‌ర‌మైన వైద్య చికిత్స అందించేలా కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని త‌న పిటిష‌న్‌లో కోరారు. అదేవిధంగా ఆయన చేపట్టిన నిరసనలో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వాలు చర్చలు ప్రారంభించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు త‌మ స్పంద‌న కోరుతూ కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామ‌ని తెలిపింది.

Also Read..

అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' మాస్టర్ ప్లాన్ ఇదే!

రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ

ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ.. దేశంలోనే తొలిసారి

Advertisement
Advertisement