Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court | టీఎంసీ (TMC) పార్టీ గుర్తు, పేరుపై నెలకొన్న వివాదానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని ఆదేశించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : టీఎంసీ (TMC) పార్టీ గుర్తు, పేరుపై నెలకొన్న వివాదానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తును స్తంభింపజేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయంపై మమతా బెనర్జీ (Mamata Banerjee) న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేశారు. ఈ పిటిషన్ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలు తమ వాదనలు, అఫిడవిట్లు సమర్పించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత మూడు నెలల్లోగా వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ ఓటమిపాలైన తర్వాత టీఎంసీలో విభేదాలు తలెత్తాయి. పార్టీ రెండుగా విడిపోయింది. ఓ వర్గానికి దీదీ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, వచ్చే నెల 6న జగరనున్న నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల (Bengal bypolls) నేపథ్యంలో పార్టీ గుర్తు, పేరుపై వివాదం మొదలైంది. ఇరు వర్గాలు తామే అసలైన టీఎంసీ అని, పార్టీ గుర్తు తమకే చెందాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఇరు వర్గాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం రెండు వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులను కేటాయించింది. మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆధ్వర్యంలోని టీఎంసీ (TMC) పార్టీకి ఎన్నికల సంఘం ఫుట్‌బాల్ (Football) గుర్తును కేటాయించింది. అంతేకాదు, దీదీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (Mamata All India Trinamool Congress) పేరును ఖరారు చేసింది. అటు అరూప్ రాయ్, రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గానికి ఎన్వలప్ (Envelope) గుర్తును కేటాయించింది. ఈ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ (Democratic Trinamool Congress) అనే పేరును ఖరారు చేసింది.
Also Read..
అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్‌డేట్ ఇచ్చిన దిప్కే
అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
సంబంధిత వార్తలు

Supreme Court | లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు
సెప్టెంబర్ 28, 2026

Supreme Court | నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది.. ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీం ఆందోళన
సెప్టెంబర్ 28, 2026

Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు



