త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jail Bharo Andolan | అక్టోబ‌ర్ 2న సీజేపీ జైల్ భ‌రో ఆందోళ‌న.. కీల‌క అప్‌డేట్ ఇచ్చిన దిప్కే

Jail Bharo Andolan | అక్టోబ‌ర్ 2న ముంబైలో చేప‌ట్ట‌నున్న జైల్ భరో ఆందోళన (Jail Bharo Andolan)కు సంబంధించి సీజేపీ కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శివాజీ పార్కులో సాయంత్రం 4 గంట‌ల‌కు ఆందోళ‌న‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది.

D

National | Published On Sep 28, 2026, 3.16 pm IST

Jail Bharo Andolan | అక్టోబ‌ర్ 2న సీజేపీ జైల్ భ‌రో ఆందోళ‌న.. కీల‌క అప్‌డేట్ ఇచ్చిన దిప్కే
Advertisement

Jail Bharo Andolan | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (CEC gyanesh kumar) రాజీనామా కోరుతూ అక్టోబ‌ర్ 2న కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (CJP) నిర్వ‌హించ త‌ల‌పెట్టిన నిర‌స‌న‌ల‌కు ముంబై పోలీసులు (Mumbai Police) అనుమ‌తి నిరాక‌రించారు. ఈ నేప‌థ్యంలో సీజేపీ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అక్టోబ‌ర్ 2న ముంబైలో భారీ ఎత్తున జైల్ భ‌రో ఆందోళ‌న (Jail Bharo Andolan) నిర్వ‌హిస్తామ‌ని ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ప్ర‌క‌టించారు.

కాగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ అక్టోబ‌ర్ 2న ముంబై వేదిక‌గా దేశ వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు శివాజీ పార్కులో నిర‌స‌న‌ల‌కు ముంబై పోలీసుల‌ను అనుమ‌తి కోరింది. సీజేపీ నిర‌స‌న‌కు ముంబై పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అక్క‌డ భారీగా జ‌నం గుమిగూడితే శ‌బ్ధ కాలుష్యం, ట్రాఫిక్ ర‌ద్దీ, ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. నిర‌స‌న‌ల‌కు మ‌రో వేదిక‌ను ఖ‌రారు చేసుకుని అనుమ‌తికోరాల‌ని సూచించారు. అయితే, ముంబై పోలీసుల వాద‌న‌ను సీజేపీ తోసిపుచ్చింది. ప్ర‌జ‌ల గొంతును అణ‌చివేయ‌డానికి చేసే ఇటువంటి చ‌ర్య‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోద‌యోగ్యం కాద‌ని దిప్కే విమర్శించారు. ఈ మేర‌కు గాంధీ జ‌యంతి (Gandhi Jayanti) నాడు సాయంత్రం 4 గంట‌ల‌కు జైల్ భరో ఆందోళన (Jail Bharo Andolan) ప్రారంభిస్తామని CJP తాజాగా ప్రకటించింది.

Also Read..

అక్ర‌మ లావాదేవీలు.. ర‌కుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

శిశువులకు బంగారు ఉంగ‌రం.. మేన‌మామ కానుక ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం విజ‌య్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ బీజేపీకి తొత్తుగా మారారు: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Advertisement
Advertisement