Delhi Pollution | పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు, 50% సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోమ్.. శీతాకాలానికి సిద్ధమవుతున్న ఢిల్లీ
Delhi Pollution | శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది (Winter Pollution Plan). వాయు కాలుష్య నియంత్రణకు కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు చేసింది. 50% సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోమ్ (WFH For Offices) వంటి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Delhi Pollution | త్రినేత్ర న్యూస్ : శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం (air pollution) గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. ఈ సీజన్‌లో వాహనాల నుంచి వెలువడే పొగ, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి (Stubble Burning) తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గాలిలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. దీంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఫలితం మాత్రం శూన్యం.
ఈ ఏడాది శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది (Winter Pollution Plan). వాయు కాలుష్య నియంత్రణకు కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయడంతోపాటూ (Parking Charges To Double) నిర్మాణం- కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH For Offices) వంటి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను నవంబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ కార్యాలయాల పనివేళలు కూడా విడతల వారీగా ఉంటాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ 50 శాతం సిబ్బందితో పనిచేయనున్నాయి. మిగిలిన 50 శాతం సిబ్బంది ఇంటి నుంచి పని చేస్తారు.
Also Read..
అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్‌డేట్ ఇచ్చిన దిప్కే
అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
సెప్టెంబర్ 23, 2026

College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు
సెప్టెంబర్ 23, 2026

Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Trisha | మధురైలో విజయ్, త్రిష పోస్టర్లు - చెన్నై క్వీన్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
- ●Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
- ●Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్‌డేట్ ఇచ్చిన దిప్కే
- ●KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి
- ●Austria Working Holiday Visa India | జాబ్ ఆఫర్ అక్కర్లేదు, స్పాన్సర్ అవసరం లేదు: భారతీయులకు ఆస్ట్రియా గోల్డెన్ ఛాన్స్.. 12 నెలల వర్కింగ్ వీసా వివరాలివే
- ●Rakul Preet Singh | అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

Trisha | మధురైలో విజయ్, త్రిష పోస్టర్లు - చెన్నై క్వీన్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..

Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్‌డేట్ ఇచ్చిన దిప్కే

KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి



