Supreme Court | గృహిణులను కేవలం హోమ్ మేకర్స్‌గా చూడొద్దు.. వారు ‘దేశ నిర్మాతలు’ : సుప్రీంకోర్టు
Supreme Court | గృహిణులను కేవలం హోమ్ మేకర్స్‌గా చూడొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిని దేశ నిర్మాతలుగా (nation builders) గుర్తించాలని వ్యాఖ్యానించింది.
Supreme Court | కోట్లాదిమంది గృహిణుల (homemakers) విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. గృహిణులను కేవలం హోమ్ మేకర్స్‌గా చూడొద్దని తెలిపింది. వారిని దేశ నిర్మాతలుగా (nation builders) గుర్తించాలని వ్యాఖ్యానించింది. దానికి తగ్గట్టుగా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గృహిణి సేవలను కనీసం 30 వేల రూపాయల ఆదాయంగా పరిగణించాల అందులో పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ప్రతిఫలం ఆశించకుండా గృహిణులు ఇంట్లో చేసే పనుల వెనుక ఉన్న ఆర్థిక ప్రాముఖ్యతను కోర్టు నొక్కి చెప్పింది. "గృహిణులు కుటుంబానికి ఎంతో సహకారం అందిస్తారు. వారు నిజమైన జాతి నిర్మాతలు. దేశ నిర్మాణంలో వారిది కీలక పాత్ర. అలాంటనప్పుడు వారి సహకారం, సేవల్ని మీరు డబ్బుతో ఎలా కొలుస్తారు..? 'హోమ్ మేకర్' అనే పదం ఇకపై 'దేశ నిర్మాత' అనే సంక్షిప్త రూపాన్ని సంతరించుకోవాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా నష్టపరిహారాన్ని లెక్కించాల్సి వచ్చినప్పుడు గృహిణుల గృహ సంరక్షణ సేవల నష్టాన్ని ఒక ప్రత్యేక అంశంగా పరిగణించాలని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దానికి అనుగుణంగా వారి నెలవారీ ఆదాయాన్ని రూ. 30,000గా నిర్ధారించింది. ఈ విషయమై గతంలోనూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేసిన ధర్మాసనం.. దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారని ఆశిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
Also Read..
"కష్టకాలంలో దీదీని వదలను" - రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా
5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో
"ఈ దాడులు తక్షణమే ఆగాలి!" - అమెరికాకు భారత స్ట్రాంగ్ వార్నింగ్
సంబంధిత వార్తలు

Meenakshi Natarajan | రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజ్ పిటిషన్
జూన్ 11, 2026

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
జూన్ 8, 2026

Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Dev Ji | ఇంటర్‌లోనూ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులంటే..?
- ●Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?
- ●Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
- ●Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్

Dev Ji | ఇంటర్‌లోనూ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులంటే..?

Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్



