Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
Supreme Court | నల్సార్ వర్సిటీ వివాదంలో లా విద్యార్థులకు భారీ ఊరట లభించింది. లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు (disciplinary action) తీసుకునే చట్టపరమైన అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు (disciplinary action) తీసుకునే చట్టపరమైన అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కు లేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) వివాదానికి సంబంధించి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) స్నాతకోత్సవానికి (convocation) సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. నల్సార్‌కు చెందిన 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని, విద్యార్థులు, అధ్యాపకులపై విచారణ జరపాలంటూ ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను బీసీఐ వెనక్కి తీసుకుంది. అంతేకాదు, విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఏ అధికారంతో బీసీఐ చైర్మన్ ఈ ఆదేశాలు జారీ చేశారో పరిశీలించాలని కోరుతూ నల్సార్ పూర్వ విద్యార్థులు మిహిరా సూద్, అభిషేక్ తివారీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. లా విద్యార్థులపై చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు గానీ, రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు గానీ లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు లా కోర్సు పూర్తి చేసి, అధికారికంగా అడ్వకేట్‌గా ఎన్‌రోల్ (enrol) అయిన తర్వాత మాత్రమే బార్ కౌన్సిల్ పరిధిలోకి వస్తారని కోర్టు పేర్కొంది. లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కేవలం సంబంధిత విద్యాసంస్థకు లేదా ఆ సంస్థ నిబంధనల ప్రకారం ఏర్పాటైన అధికారులకు మాత్రమే ఉంటుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆగస్టు 13న బీసీఐ జారీ చేసిన ఆదేశాలన్నీ చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.
ఇదీ వివాదం..
నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వందలాది మంది విద్యార్థులు సీజేఐ రాకను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థుల వైఖరిపై బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను గౌరవించని వారు లాయర్లు కాలేరంటూ విద్యార్థులందరిపైనా బ్యాన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
బీసీఐ నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్ విద్యార్థులందరి ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన వివాదాస్పద సర్య్కులర్‌ను కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది. ఈ వివాదంపై సీజేఐ సూర్యకాంత్ సైతం తీవ్రంగా స్పందించారు. ఇది తనకు, విద్యార్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ విషయంతో బార్ కౌన్సిల్‌కు ఏంటి సంబంధం..? అని ప్రశ్నించారు.
Also Read..
జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
రెడ్‌మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి
- ●Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
- ●Talasani Srinivas Yadav | సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే
- ●Gadwal Vijayalakshmi | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి
- ●Bharat NCAP 2.0 | భారత్ ఎన్‌క్యాప్ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన
- ●Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్

Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి

Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం

Talasani Srinivas Yadav | సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే

Gadwal Vijayalakshmi | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి






