AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
AI Express flight | వారణాసి నుంచి ఢిల్లీకి (Varanasi to Delhi flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (AI Express flight)ని లగేజీ స్టోర్ చేసే డెస్క్‌లో పొగలు రావడం కలకలం రేపింది.
AI Express flight | త్రినేత్ర.న్యూస్ : విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. విమానాల్లో తలెత్తుతున్న ఇంజిన్ ఫెయిల్, పొగలు, సాంకేతిక లోపాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (AI Express flight)ని లగేజీ స్టోర్ చేసే డెస్క్‌లో పొగలు రావడం కలకలం రేపింది.
ఎయిర్ ఇండియాకు చెందిన IX 1253 ఎక్స్‌ప్రెస్ విమానం ఇవాళ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి (Varanasi to Delhi flight) బయల్దేరింది. అయితే, విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌లో (aircraft cargo hold) పొగ (smoke) రావడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ విమానాన్ని ముందు జాగ్రత్త చర్యగా లక్నోకు మళ్లించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో విమానాన్ని లక్నో (Lucknow)లోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Chaudhary Charan Singh International Airport)లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఆ సమయంలో విమానంలో 155 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం లక్నో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే టెక్నికల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పొగ కనపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Also Read..
చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
- ●Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?






