Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
Earthquake | టిబెట్ (Tibet)లో భూకంపం (Earthquake ) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
International | Published On Sep 3, 2026, 2.57 pm IST
Earthquake | త్రినేత్ర.న్యూస్ : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో మాటల్లో చెప్పలేం. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లో ఒక హిమనీనదం కూలిపోవడం గత నెల 26న వచ్చిన జల ప్రళయానికి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4 వేల మందికిపైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నేపాల్ వాసులను భారీ భూకంపం (Earthquake) మరింత భయాందోళనకు గురి చేసింది.
ఇవాళ టిబెట్ (Tibet)లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, గత నెల సంభవించిన వరదలు నేపాల్ సరిహద్దు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేశాయి. వరద విధ్వంసానికి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు, వాహనాలు, రోడ్లు, మార్కెట్లు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ వరదలకు 1,250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4,800 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. వీరిలో భారతీయులు, ఇతర విదేశీయులు ఉన్నారు. మొన్నటి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదు. అక్కడ నదుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తతుం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
సంబంధిత వార్తలు

Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు
సెప్టెంబర్ 8, 2026

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



