త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Redmi 17 5G | రెడ్‌మీ 17 5జి ఫోన్ వ‌చ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో అదిరిపోయింది..

Redmi 17 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో తన నంబర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 17 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను గురువారం అధికారికంగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 5జి కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 వంటి ప్రత్యేకతలను ఇందులో అందించింది.

S

Technology | Published On Sep 3, 2026, 3.22 pm IST

Redmi 17 5G | రెడ్‌మీ 17 5జి ఫోన్ వ‌చ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో అదిరిపోయింది..
Advertisement

Redmi 17 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో తన నంబర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 17 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను గురువారం అధికారికంగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 5జి కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 వంటి ప్రత్యేకతలను ఇందులో అందించింది. ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల హెచ్‌డీ ప్లస్ 120 హెడ్జ్‌ అడాప్టివ్‌సింక్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మధ్యలో పంచ్‌హోల్ డిజైన్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణతోపాటు ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. వెట్ టచ్ టెక్నాలజీతో తడిగా ఉన్న చేతులతోనూ స్క్రీన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

క‌ళ్ల‌ను ర‌క్షించే స్క్రీన్‌..

కళ్ల రక్షణ కోసం మూడు టీయూవీ రైన్‌లాండ్ సర్టిఫికేషన్లతో పాటు డీసీ డిమ్మింగ్‌ను అందించారు. ఫ్లాట్ డిస్‌ప్లే, మ్యాట్ ఫ్రేమ్, మెటల్ డెకో డిజైన్‌తో ఫోన్ కనిపిస్తుంది. కాల్స్, ఛార్జింగ్, గేమింగ్, యాప్ అలర్ట్స్ వంటి సందర్భాల్లో నోటిఫికేషన్లను అందించేందుకు డైనమిక్ ఆర్‌జీబీ లైట్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ ను ఇచ్చారు. 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. మెమరీ ఎక్స్‌టెన్షన్ ద్వారా 12జీబీ వరకు ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే షియోమీ హైపర్‌ఓఎస్ 3తో ఫోన్ వస్తుంది. మెరుగైన రెస్పాన్స్‌, సిస్టమ్ యానిమేషన్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది.

భారీ బ్యాట‌రీ..

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్ ఏఐ డ్య‌యల్ కెమెరా వ్యవస్థను అందించారు. ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసుకునే డ్యుయల్ వ్యూ రికార్డింగ్ ఫీచర్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతోపాటు వాల్యూమ్ బూస్ట్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా గరిష్ఠంగా 300 శాతం వరకు వాల్యూమ్ పెంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 7,900 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. 45 వాట్ టర్బో ఛార్జింగ్‌కు ఇది మద్దతు ఇస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 96 నిమిషాలు పడుతుంది. కేవలం 35 నిమిషాల ఛార్జింగ్‌తో రోజువారీ వినియోగానికి సరిపడా పవర్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే 22.5 వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా ఇతర పరికరాలు, యాక్సెసరీలను ఫోన్ బ్యాటరీతో ఛార్జ్ చేసుకోవచ్చు.

ధ‌ర ఎంతంటే..?

రెడ్‌మీ 17 5జి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అబ్సల్యూట్ బ్లాక్, ఎండ్‌లెస్ బ్లూ, ఎటర్నల్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఎటర్నల్ ఆరెంజ్ వేరియంట్‌లో పీయూ లెదర్ ఫినిష్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా ఉంది. సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్ కామ్, షియోమీ రిటైల్ స్టోర్లు, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement