Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా రష్మిక మందన్న – దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్
భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన హీరోయిన్ల లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో టాప్ ఫైవ్‌లో నిలిచిన హీరోయిన్లు ఎవరంటే?
Entertainment | Published On Sep 3, 2026, 2.44 pm IST
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్‌లో మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్ల లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్ట్‌లో దీపికా పడుకోణ్, సాయిపల్లవితో పాటు పలువురు హీరోయిన్ల రష్మిక తర్వాతే ఉండటం గమనార్హం. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే మ్యాగజైన్ క్రేజ్, స్టార్‌డమ్ పరంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోయిన్లు ఎవరనేదానిపై ఓ సర్వేను నిర్వహించింది. ఈ లిస్ట్‌లో రష్మిక మందన్నకు టాప్ ప్లేస్ దక్కింది. దీపికా పడుకోణ్ రెండో స్థానంలో నిలిచింది.
దీపికాను దాటేసి...
ఇండియా టుడే ప్రతి ఎటా ఈ సర్వేను నిర్వహిస్తుంటుంది. గత నాలుగేళ్లుగా ఈ లిస్ట్‌లో దీపికా పడుకోణ్ నంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తూ వచ్చింది. ఈ సారి ఈ బాలీవుడ్ బ్యూటీకి నేషనల్ క్రష్ షాకిచ్చింది. రష్మిక దెబ్బకు దీపికా పడుకోణ్ రెండో స్థానానికి పడిపోయింది.
సాహో హీరోయిన్...
ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ నిలిచింది. నాలుగో ప్లేస్‌ను నాచురల్ బ్యూటీ సాయిపల్లవి దక్కించుకుంది. ఐదో స్థానం అలియాభట్‌కు దక్కింది. టాప్ ఫైవ్‌లో దక్షిణాది నుంచి రష్మిక మందన్నతో పాటు సాయిపల్లవికి మాత్రమే ఉన్నారు.
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్...
పుష్ప, పుష్ప 2తో పాటు బాలీవుడ్ సినిమాలు ఛావా, యానిమల్ బ్లాక్‌బస్టర్స్‌తో రష్మిక పేరు దక్షిణాదిలో పాటు బాలీవుడ్‌లో మారుమోగిపోయింది. మరోవైపు విజయ్ దేవరకొండతో పెళ్లితో వార్తల్లో నిలిచింది. వివాహం తర్వాత రష్మిక క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది.
రణబాలి...మైసా...
ప్రస్తుతం తెలుగులో రణబాలితో పాటు మైసా సినిమాలు చేస్తోంది. భర్త విజయ్ దేవరకొండతో కలిసి పెళ్లి తర్వాత రష్మిక నటిస్తున్న ఫస్ట్ మూవీగా రణబాలి దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో చేసిన మైసా నవంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Devarakonda Family | మూడు నెలల …మూడు సినిమాలు – దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
సెప్టెంబర్ 1, 2026

Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే – నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



