Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
Supreme Court | న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ ఆధారిత నకిలీ తీర్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయ ప్రక్రియలోని ప్రతి దశలోనూ నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని నొక్కి చెప్పింది.
Supreme Court | న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు సహాయపడగలదే కానీ, అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేసింది.
దివాలా వివాదానికి సంబంధించిన కేసులో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT), జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఇచ్చిన తీర్పును జస్టిస్ పీఎస్ నర్సింహా, అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్టిఫిషియల్ ద్వారా సృష్టించిన, ఉనికిలో లేని నకిలీ అంశాలను.. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులుగా భావించి ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తించింది.
ఏఐ ఆధారిత నకిలీ తీర్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు NCLT ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఒకవేళ నకిలీ అంశం వస్తే, ఆ నిర్ణయాలను పక్కన పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ తీర్పులపై కఠినంగా వ్యవహరించాలని న్యాయస్థానాలకు సూచించింది. న్యాయ ప్రక్రియలోని ప్రతి దశలోనూ నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగం వల్ల తలెత్తే సవాళ్లను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)ని ధర్మాసనం ఆదేశించింది.
Also Read..
నీట్ యూజీ ఫలితాలపై కీలక ప్రకటన చేసిన ఎన్టీఏ
అమర్‌నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్‌రావు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Subhash Chandra | సుభాష్ చంద్రకు భారీ షాక్.. రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్‌పై ఎన్సీఎల్టీ స్టే..
సెప్టెంబర్ 1, 2026

Supreme Court | యాసిడ్ దాడులపై సుప్రీం సీరియస్.. అమ్మకాలపై కీలక వ్యాఖ్యలు..!
ఆగస్టు 31, 2026

Supreme Court | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని కచ్చితంగా వెల్లడించాలి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
- ●Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!

Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే



