త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాక‌ప్‌..

HUAWEI Band 11 Series | మొబైల్స్‌, ఫిట్‌నెస్ ప‌రికరాల త‌యారీ సంస్థ హువావే త‌న నూత‌న ఫిట్‌నెస్ బ్యాండ్ ను భార‌త్ లో హువావే బ్యాండ్ 11 సిరీస్ పేరిట విడుద‌ల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా హువావే బ్యాండ్ 11, బ్యాండ్ 11 మెట‌ల్‌, బ్యాండ్ 11 ప్రొ మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

S

Technology | Published On Jul 2, 2026, 4.48 pm IST

HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాక‌ప్‌..
Advertisement

HUAWEI Band 11 Series | మొబైల్స్‌, ఫిట్‌నెస్ ప‌రికరాల త‌యారీ సంస్థ హువావే త‌న నూత‌న ఫిట్‌నెస్ బ్యాండ్ ను భార‌త్ లో హువావే బ్యాండ్ 11 సిరీస్ పేరిట విడుద‌ల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా హువావే బ్యాండ్ 11, బ్యాండ్ 11 మెట‌ల్‌, బ్యాండ్ 11 ప్రొ మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇవి ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌ను క‌లిగి ఉన్నాయి. అలాగే హెల్త్ ట్రాకింగ్‌, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం ప‌లు స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను ఈ బ్యాండ్స్‌లో ఇచ్చారు. హువావే బ్యాండ్ 11 సిరీస్‌లో 1.62 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. బ్యాండ్ 11లో గ‌రిష్టంగా 1500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ల‌భిస్తుంది. బ్యాండ్ 11 ప్రొ లో 2000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఇచ్చారు. అందువ‌ల్ల సూర్య‌కాంతిలోనూ డిస్‌ప్లేలు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఇక ఇవి కేవ‌లం 8.99 ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి అత్యంత స్లీక్ డిజైన్‌తో ఉంటాయి. బ‌రువు కేవ‌లం 17 గ్రాములు కావ‌డం విశేషం.

నిరంత‌ర హార్ట్ రేట్ మానిట‌రింగ్‌..

హువావే బ్యాండ్ 11 మెట‌ల్‌, బ్యాండ్ 11 ప్రొ మోడ‌ల్స్‌లో ప్రీమియం అల్యూమినియం అలాయ్ కేసింగ్‌ను ఇచ్చారు. యూజ‌ర్లు 100కు పైగా వాచ్ ఫేస్‌ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉండ‌డం వ‌ల్ల డిస్‌ప్లే ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. దీనిపై క‌స్ట‌మైజ్ చేసుకునే విడ్జెట్‌ల‌ను కూడా అందించారు. ఆరోగ్య ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఈ బ్యాండ్‌ల‌లో ఆధునిక ఫీచ‌ర్ల‌ను అందించారు. హార్ట్ రేట్ వేరియ‌బిలిటీ (హెచ్ఆర్‌వీ) ఆధారిత మెరుగైన నిద్ర ట్రాకింగ్‌, నిరంత‌ర హార్ట్ రేట్ మానిట‌రింగ్‌, ఎస్‌పీవో2 మానిట‌రింగ్‌, స్ట్రెస్ ట్రాకింగ్‌, నిద్ర‌లో శ్వాస‌పై అవ‌గాహ‌న‌, ప‌ర్స‌న‌లైజ్డ్ స్లీప్ ఇన్‌సైట్స్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. అలాగే ఎమోష‌న‌ల్ హెల్త్ మానిట‌రింగ్‌, గైడెడ్ బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌లు, ప‌ల్స్ వేవ్ అరిత్మియా అనాలిసిస్ ఫీచర్లను కూడా అందించారు. ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం 100కు పైగా వర్కౌట్ మోడ్‌లకు సపోర్ట్ ఇచ్చారు. ఇంటెలిజెంట్ యాక్టివిటీ మానిటరింగ్, పనితీరు విశ్లేషణ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

8 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

హువావే బ్యాండ్ 11 ప్రొలో స్వతంత్ర జీఎన్‌ఎస్‌ఎస్ పొజిషనింగ్ వ్యవస్థను అందించారు. దీంతో రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీల సమయంలో మరింత క‌చ్చితమైన రూట్ ట్రాకింగ్, నావిగేషన్ లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, హువావే బ్యాండ్ 11 సిరీస్ గరిష్టంగా 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ వినియోగంలో 8 రోజుల వరకు పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ అందించారు. స్మార్ట్ ఫీచర్లలో కాల్, మెసేజ్ నోటిఫికేషన్లు, క్యాలెండర్ రిమైండర్లు, వాతావరణ సమాచారం, కాలిక్యులేటర్, రిమోట్ కెమెరా కంట్రోల్స్‌తోపాటు మరికొన్ని ఉపయోగకరమైన టూల్స్ ఉన్నాయి. ఈ వేరబుల్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు అనుకూలంగా పనిచేస్తాయి.

ధ‌ర వివ‌రాలు..

హువావే బ్యాండ్ 11 సిరీస్ ను గురువారం నుంచే విక్ర‌యిస్తున్నారు. ప్ర‌ముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ మోడ‌ల్స్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వచ్చు. హువావే బ్యాండ్ 11 ధ‌ర రూ.6,499 ఉండ‌గా, ప్రారంభ ఆఫ‌ర్ కింద రూ.3,999కే ఇస్తున్నారు. అలాగే హువావే బ్యాండ్ 11 మెట‌ల్ ధ‌ర రూ.7,999 ఉండ‌గా, లాంచింగ్ ఆఫ‌ర్ కింద రూ.4,799కి ఇస్తున్నారు. హువావే బ్యాండ్ 11 ప్రొ ధ‌ర రూ.8,999 కాగా, ప్రారంభ విక్రయ ధరను రూ.5,599గా నిర్ణ‌యించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement