Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
Harish Rao | ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మీడియా సమక్షంలో ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు.. గన్‌పార్కుకు రావాలని మంత్రులు అంటే.. అక్కడికి వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మీడియా సమక్షంలో ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు.. గన్‌పార్కుకు రావాలని మంత్రులు అంటే.. అక్కడికి వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల టెండర్లకు సంబంధించి రూ. 2 వేల కోట్ల విలువైన టెండర్లు జరిగాయి. ఈ టెండర్లలో అవినీతి, అక్రమాలు జరిగాయి. బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం జరిగిందని నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ మాట్లాడినం. చర్చకు సిద్ధమని అనేకసార్లు చెప్పి చివరకు మంత్రులు తోక ముడిచారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నా మీరు రండి అని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు. మరి ఎందుకు రాలేదు మంత్రులు. ట్విస్ట్ ఇచ్చారు.. ఆర్ఎస్పీతో మాట్లాడం హరీశ్‌రావు వస్తేనే మాట్లాడుతం అని ట్విస్ట్ ఇచ్చారు. నా నియోజకవర్గంలో నాకు ప్రొగ్రామ్స్ ఉండే.. అయినా కూడా నేను వచ్చాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోదామని హరీశ్‌రావు తెలిపారు.
గన్ పార్కుకు రానివ్వాలి కదా..?
ప్రజల కోసం బేషజాలు అవసరం లేదని చెప్పి మంత్రులు పిలిచిన వద్దకే వెళ్దామని బయల్దేరాం. మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. హిట్లరే మార్గదర్శకమన్న ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి. మంత్రుల సవాల్ నిజమైతే, చర్చకు సిద్ధమైతే మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు.. గన్ పార్కుకు రానివ్వాలి కదా..? ప్రజల కోసం రెండు అడుగులు వెనక్కి తగ్గి.. ముందుకు వెళ్లే అడ్డుకున్నారు. ముగ్గురు మంత్రులకు ఫోన్లు చేస్తే ఎత్తలేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కుండ బద్దలు కొట్టినట్టు ఖుల్లం ఖుల్లా
పోలీసు అధికారులకు చెప్పాం మంత్రులు పిలిచారని.. కొట్లాటకు వెళ్లడం లేదు చర్చకు పోతున్నామని చెప్పాం. మంత్రుల సవాల్‌ను స్వీకరించి వెళ్తున్నామంటే.. అరెస్టు చేసి పీఎస్‌లో పెట్టారు. దీంతో చర్చకు మీరు సిద్ధంగా లేరని, టెండర్లలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. మమ్మల్ని అరెస్టు చేసి తప్పించుకున్నారు. కంచన్‌బాగ్ పీఎస్‌కు రండి అని పిలుపునిచ్చాం. అక్కడ కూడా కుర్చీ ఏర్పాటు చేశాం.. ఇక్కడ కూడా చర్చించడానికి సిద్ధం అని చెప్పాం. పోలీసు పహారాలో సెక్రటేరియల్, గన్ పార్కు అసెంబ్లీకి తీసుకెళ్లండి అని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు.. అవినీతిపై సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయిందని అర్థమవుతుంది. చాటుకు మాట్లాడుడు ఎందుకు మీడియా, ప్రజల సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు ఖుల్లం ఖుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడింది కాబట్టే పోలీసులను అడ్డం పెట్టుకుని చర్చ లేకుండా పారిపోయారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | రేవంత్.. పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి.. నాది కాదు : హరీశ్‌రావు
జులై 10, 2026

CM Revanth Reddy | ‘భట్టి’ కన్నెర్ర జేస్తే ‘బీఆర్ఎస్’ భస్మమైతది.. సీఎం రేవంత్ ఛలోక్తి
జులై 10, 2026

CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



