Harish Rao | రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్ర అప్పుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలకు నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా..? ఆయనకు పాలమూరు పౌరుషం, చీము నెత్తురు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర అప్పుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలకు నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా..? ఆయనకు పాలమూరు పౌరుషం, చీము నెత్తురు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కంచన్‌బాగ్ పోలీసు నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేస్తాను అని జూపల్లి కృష్ణారావు చెప్పారు. మరి ఎందుకు తెలంగాణ భవన్‌కు ఎందుకు రాలేదు. భవన్‌లో కేటీఆర్ వేదిక సిద్ధం చేసి పెడితే ఆయన తోక ముడిచారు. జూపల్లికి పాలమూరు పౌరుషం, చీము, నెత్తురు ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చూపిస్తానని అని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని అంటున్నాడు. చర్చ జరిగి ఉంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. మరి నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా.. నువ్వు రాజీనామా చేయ్ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నా లెక్కలకు సభను వాయిదా వేసుకున్నారు..
జూపల్లికి సబ్జెక్టు లేక చర్చకు రాకుండా ముఖం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్.. నువ్వు స్పందించి నేనే భవన్‌కు వస్తా అని జూపల్లి అన్నారు. విషయం లేక తోక ముడిచారు. అసెంబ్లీ వేదికగా అప్పుల గురించి వివరంగా చెప్పి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. అప్పులపై మాట్లాడాని భట్టి విక్రమార్కకు సవాల్ విసిరితే.. నా లెక్కలకు, సవాల్‌కు చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకుని పోయింది. కాంగ్రెస్ పార్టీకి వదేండ్ల చరిత్ర ఉంది.. డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు.. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలో తమకు తెలుసని భట్టి రెచ్చిపోయి మాట్లాడారు.. ఇవాళ అడుగుతుంటే.. బీఆర్ఎస్ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
మళ్లీ అసెంబ్లీ పెట్టండి..
మళ్లీ అసెంబ్లీ పెట్టండి.. ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్ధంగా ఉంది బీఆర్ఎస్. విషయం లేక జూపల్లి తోక ముడిచారు. ఉదయం 10.30 నుంచి ఈ నిమిషం వరకు కూడా భవన్‌లోనే ఉన్నాం. కానీ జూపల్లి మాట మార్చి అమరవీరుల స్థూపం వద్ద ఉన్నా అంటే అక్కడి వెళ్తుంటే కేటీఆర్‌ను అడ్డుకున్నారని హరీశ్‌రావు తెలిపారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు
సెప్టెంబర్ 1, 2026

MLA Prashanth Reddy | కాంగ్రెస్‌తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?
సెప్టెంబర్ 1, 2026

Ramchander Rao | కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామచందర్ రావు ఫైర్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?
- ●OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
- ●Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
- ●Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం
- ●Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అప్రజాస్వామికం
- ●Suman Ray | ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమన్ రే..

India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ

Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్

Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం



