Vishwambhara | ఎట్టకేలకు థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష కమ్‌బ్యాక్ మూవీ కష్టాలకు పుల్‌స్టాప్ పడేది ఎప్పుడంటే?
చిరంజీవి విశ్వంభర మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. సోషియా ఫాంటసీ యాక్షన్‌గా రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 16న విడుదల కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీతో దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ ఇవ్వబోతుంది.
Entertainment | Published On Jul 2, 2026, 5.10 pm IST
Vishwambhara | చిరంజీవి విశ్వంభర మూవీని అనౌన్స్ చేసి మూడేళ్లు దాటిపోయింది. షూటింగ్ పూర్తయి ఏడాది అవుతోంది. అయినా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. గత ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. రీషూట్స్‌తో పాటు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేశారు. విశ్వంభర షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే మన శంకర వరప్రసాద్‌గారు సెట్స్‌లో చిరంజీవి అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయినా విశ్వంభర మాత్రం థియేటర్లలోకి రాలేదు. కనీసం రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ కూడా మేకర్స్ రివీల్ చేయకపోవడంపై విమర్శలు వస్తోన్నాయి.
దసరాకు థియేటర్లలోకి...
ఎట్టకేలకు విశ్వంభర విడుదల తేదీ కన్ఫామ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్సయ్యారట. రిలీజ్ డేట్‌ను ఈ వారంలోనే అఫీషియల్‌గా అనౌన్స్‌చేసే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారట.
పదేళ్ల తర్వాత...
సోషియో ఫాంటసీ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత విశ్వంభరతో టాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ ఇవ్వబోతుంది. గతంలో త్రిష, చిరంజీవి కాంబినేషన్‌లో 2006లో స్టాలిన్ మూవీ వచ్చింది. ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరు కలిసి సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. త్రిషతో పాటు మరో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ కనిపించబోతుంది.
రెండు వందల కోట్ల బడ్జెట్...
తాను ప్రేమించిన అమ్మాయి కోసం పధ్నాలుగు లోకాలు దాటిన ఓ యోధుడి కథతో విశ్వంభర మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి, బాబీ రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి – హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
జులై 2, 2026

Sreeleela | షూటింగ్‌ల మధ్యే పరీక్షలకు హాజరయ్యా.. డాక్టర్ డే సందర్భంగా శ్రీలీల ఆసక్తికర కామెంట్స్.
జులై 1, 2026

Kayadu Lohar | రక్తం కారేలా కొట్టా..! స్కూల్ డేస్‌లో లైంగిక వేధింపులపై కయాదు లోహర్ ఆవేదన..!
జులై 1, 2026
తాజావార్తలు
- ●Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ
- ●TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- ●Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Indian Navy | భారత్ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
- ●Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్‌రావు
- ●Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ

TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల

Indian Navy | భారత్ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?



