త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!

E20 Petrol | ఈ20 పెట్రోల్ విధానంపై ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దాంతో వాహనాలపై, ముఖ్యంగా పాత ఇంజిన్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై సమగ్రంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాదికి ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కోర్టుకు తెలియజేసింది.

P

National | Published On Jun 30, 2026, 7.27 pm IST

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!
Advertisement

E20 Petrol | ఈ20 పెట్రోల్ విధానంపై ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దాంతో వాహనాలపై, ముఖ్యంగా పాత ఇంజిన్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై సమగ్రంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాదికి ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కోర్టుకు తెలియజేసింది. ఈ20 పెట్రోల్‌కు సంబంధించి దాఖలైన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. ఇథనాల్ సరఫరా ఒప్పందాలు ఇప్పటికే ఖరారయ్యాయని, వాటిలో తరచూ మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అదే సమయంలో 20శాతం ఇథనాల్ బెల్డింగ్ విధానం అమ‌లు చేయాల‌న్న ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అయితే, ఇథనాల్ సరఫరా పరిమాణం మాత్రం డిమాండ్‌, మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చని కేంద్రం పేర్కొంది. ఈ20 పెట్రోల్‌పై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో పాత వాహనాల ఇంజిన్‌లపై ప్రభావం, మైలేజ్ తగ్గుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలకు ఇప్పటివరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని కేంద్రం వాదిస్తోంది. పైగా ఇథనాల్ బ్లెండింగ్‌తో ముడి చమురు దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటివరకు కార్యక్రమం ద్వారా సుమారు రూ.1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక వ్యయం ఆదా అయినట్లు కేంద్రం వివరించింది. అదే సమయంలో చెరకు, మ‌క్కజొన్న వంటి పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని, కర్బన ఉద్గారాల తగ్గింపుకు కూడా ఈ విధానం దోహదపడుతోందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ20 పెట్రోల్ సరఫరా ప్రారంభమైంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 20శాతం ఇథనాల్ మిశ్రమాన్ని 2025 నాటికే, నిర్దేశిత గడువుకు ఐదేళ్ల ముందే సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇక దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి 2030 నాటికి 30 శాతం మిశ్రమాన్ని చేరుకోవాలన్న దిశగా ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement