Supreme Court | ‘బాహుబలి’లా ప్రవర్తించడం మానుకోండి.. సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Supreme Court | బీహార్ సెషన్స్ జడ్జి (Bihar Sessions Judge) అనిల్ కుమార్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయలేదన్న కారణంతో రోహతాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) రౌషన్ కుమార్‌ను కోర్టు ధిక్కరణ కింద దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రూ. 1 జరిమానా విధించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఇకనైనా ‘బాహుబలి’లా (bahubali) ప్రవర్తించడం మానుకోవాలంటూ తీవ్రంగా మందలించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : కోర్టు ఆదేశించినప్పటికీ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయలేదన్న కారణంతో ఒక పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించి, జరిమానా విధించిన బీహార్ సెషన్స్ జడ్జి (Bihar Sessions Judge) అనిల్ కుమార్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహారశైలిని తప్పుబడుతూ ఇకనైనా ‘బాహుబలి’లా (bahubali) ప్రవర్తించడం మానుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది.
ఇదీ కేసు..
ఒక క్రిమినల్ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సెషన్స్ జడ్జి గతంలో పోలీసులను ఆదేశించారు. అయితే, రోహతాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) రౌషన్ కుమార్ ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో దానిని కోర్టుకు వ్యతిరేకంగా జరిగిన నేరంగా జడ్జి పరిగణించారు. అంతేకాకుండా సదరు అధికారిని దోషిగా తేల్చి, జరిమానా కూడా విధించారు. సెషన్స్ జడ్జి చర్యను పాట్నా హైకోర్టు తప్పుబడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆ జడ్జి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సెషన్స్ జడ్జి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెషన్స్ జడ్జికి ఉన్న కనీస చట్టపరమైన అవగాహన, కోర్టు హాలులో ఆయన వ్యవహరించిన తీరు తమను ఆశ్చర్యానికి గురి చేసిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
శిక్ష విధించే అధికారం ఆయనకు ఉందా..?
అసలు ఆ జడ్జి తన న్యాయ పరిధిలోనే వ్యవహరించారా..? అని ప్రశ్నించింది. జిల్లా మేజిస్ట్రేట్ (DM), ఎస్పీలను కోర్టుకు పిలిపించి వారు హాజరుకాకపోవడాన్ని 'కోర్టు సమక్షంలో జరిగిన నేరంగా' (offence committed in the face of the court) పరిగణించి.. అదే రోజు వారిని దోషులుగా నిర్ధారించి శిక్ష విధించే అధికారం ఆయనకు ఉందా..? అని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. న్యాయస్థానం ఎదుట లేదా విచారణ కొనసాగుతున్న సమయంలో ఏవైనా ఆటంకాలు కలిగినప్పుడు మాత్రమే న్యాయమూర్తి తక్షణ శిక్షాత్మక చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది.
"కోర్టు హాలులో ఎవరైనా ఒకరిని చెంపదెబ్బ కొట్టినా, విచారణ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినా, లేదా న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోర్టు గదిని విడిచి వెళ్లడానికి నిరాకరించినా.. అటువంటి చర్యలను మాత్రమే 'కోర్టు సమక్షంలో జరిగిన నేరం'గా పరిగణించవచ్చు" అని ధర్మాసనం ఉదహరించింది. "సాహసాలు చాలు. మీరు రాబిన్ హుడ్ లేదా 'బాహుబలి'లా ప్రవర్తించడం మానుకోవాలి. ఒక న్యాయమూర్తిగా మీ అధికార పరిధి ఏమిటో ముందుగా తెలుసుకోండి" అని ధర్మాసనం తీవ్రంగా మందలించింది.
ఇకనైనా ‘బాహుబలి’లా ప్రవర్తించడం ఆపండి
విచారణ సమయంలో జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు జడ్జికి చట్టంపై ఉన్న అవగాహన నిజంగా చాలా నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) స్థాయి అధికారికి సమన్లు జారీ చేసి, అదే రోజున ఆయనను దోషిగా నిర్ధారిస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాదిని ఉద్దేశించి.. ఇకనైనా ‘బాహుబలి’లా ప్రవర్తించడం ఆపాలని మీ క్లయింట్‌కు చెప్పండని స్పష్టం చేశారు.
Also Read..
నేపాల్‌కు రూ. 15,000 కోట్ల భారీ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
కర్రెగుట్టల్లోకి పర్యాటకులను అనుమతించొద్దు : డీజీపీ సీవీ ఆనంద్
సంబంధిత వార్తలు

Ram Jethmalani | కరీంనగర్లో న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ
నవంబర్ 21, 2026

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
- ●Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు
- ●Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●Dhruv Rathee | ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
- ●Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత

Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్

Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు

Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..



