త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | క‌ర్రెగుట్ట‌ల్లోకి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించొద్దు : డీజీపీ సీవీ ఆనంద్

DGP CV Anand | ఒకప్పుడు మావోయిస్టుల‌కు స్థావ‌ర‌మైన క‌ర్రెగుట్ట‌ల్లోకి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తిస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్( DGP CV Anand ) హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Nov 23, 2026, 3.26 pm IST

DGP CV Anand | క‌ర్రెగుట్ట‌ల్లోకి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించొద్దు : డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

DGP CV Anand | త్రినేత్ర న్యూస్ : ఒకప్పుడు మావోయిస్టుల‌కు స్థావ‌ర‌మైన క‌ర్రెగుట్ట‌ల్లోకి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తిస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్( DGP CV Anand ) హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో క‌ర్రెగుట్ట‌ల్లోకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించొద్ద‌ని ఆయ‌న సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ అందజేత కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం క‌ర్రెగుట్ట‌ల్లో ఎలాంటి మావోయిస్టు కార్య‌క‌లాపాలు లేవ‌ని, దీంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌ని డీజీపీ తెలిపారు. గ‌తంలో మావోయిస్టులు ఆ అడ‌వుల్లో పెద్ద ఎత్తున మైన్స్ ఏర్పాటు చేశారు. వాటిలో అధికంగా ప్రెష‌ర్ మైన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ మైన్స్ ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో కూడా స‌మాచారం లేదు. కొంత‌మంది మావోయిస్టుల‌ను విచారించిన నేప‌థ్యంలో 9 డంప్‌ల ఆచూకీ చెప్ప‌డంతో వాటిని నిర్వీర్యం చేశారు. కాబ‌ట్టి కర్రెగుట్టల్లోకి పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదాలు జరిగి ఇబ్బందులు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆ ప్రాంతంలో మైన్స్‌ను పూర్తిగా క్లియర్‌ చేసి భద్రతా చర్యలు చేపట్టిన తర్వాతే పర్యాటకులు వెళ్లేందుకు అనుమతిస్తాం అని డీజీపీ తెలిపారు.

Advertisement
Advertisement