త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Stock Markets | ఇటీవల వరుస రికార్డు లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ 1.7 శాతానికి పైగా పడిపోయాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద నుంచి రూ.6.39 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

S

Business | Published On Nov 23, 2026, 3.59 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..
Advertisement

Stock Markets | ఇటీవల వరుస రికార్డు లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ 1.7 శాతానికి పైగా పడిపోయాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద నుంచి రూ.6.39 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

రూ.6.39 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. వరుస లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,458.4 పాయింట్లు (1.77 శాతం) పతనమై 82,435.99 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 451 పాయింట్లు (1.75 శాతం) నష్టపోయి 25,349.65 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.508 లక్షల కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.6.39 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణాలేమిటి..?

మార్కెట్ల పతనానికి ప్రధానంగా ప‌లు కారణాలు కనిపించాయి. ఇటీవల నిఫ్టీ 10 శాతానికి పైగా లాభపడడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు మళ్లీ బలపడ్డాయి. సీఏంఈ ఫెడ్‌వాచ్ అంచనాల ప్రకారం వడ్డీ రేట్ల పెంపునకు 93 శాతం అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మరింత‌ వడ్డీ రేట్ల పెంపులు అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంటుంది.

భారీగా బ‌ల‌హీన‌ప‌డిన రూపాయి..

ఇక రూపాయి విలువ భారీగా బలహీనపడడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.50 స్థాయిని దాటి 93 స్థాయికి చేరువైంది. రూపాయి బలహీనపడితే ముడి చమురు సహా దిగుమతుల ఖర్చులు పెరిగి దేశీయ కంపెనీలపై భారం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ వంటి భారీ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయం ప్రకారం.. కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడుల బుడగ ఏర్పడుతుందన్న ఆందోళనలు, అమెరికా ద్రవ్య విధానంపై అనిశ్చితి ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే భారత్‌లో తయారీ రంగ కార్యకలాపాలు మెరుగుపడడం, రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధి సుమారు 7.7 శాతంగా నమోదవుతుందన్న అంచనాలు దీర్ఘకాలికంగా మార్కెట్లకు సానుకూల అంశాలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement