త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhruv Rathee | ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్‌.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ!

Dhruv Rathee | ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరువునష్టం కేసులో విచారణకు పదేపదే గైర్హాజరవుతున్న నేపథ్యంలో సాకేత్‌ కోర్టు ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ చేసింది. గతంలో పలుమార్లు సమన్లు, బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్‌ 3కి వాయిదా వేసింది.

P

National | Published On Nov 23, 2026, 3.46 pm IST

Dhruv Rathee | ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్‌.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ!
Advertisement

Dhruv Rathee | ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరువునష్టం కేసులో విచారణకు పదేపదే గైర్హాజరవుతున్న నేపథ్యంలో సాకేత్‌ కోర్టు ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ చేసింది. గతంలో పలుమార్లు సమన్లు, బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్‌ 3కి వాయిదా వేసింది.

అసలు కేసు ఏంటంటే?

'ఐ సపోర్ట్‌ నరేంద్ర మోదీ' అనే సోషల్‌ మీడియా పేజీ వ్యవస్థాపకుడు వికాస్‌ సాంకృత్యాయన్‌ అలియాస్‌ వికాస్‌ పాండే ఈ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ధ్రువ్‌ రాఠీ రూపొందించిన 'బీజేపీ ఐటీ సెల్‌ పార్ట్‌ 2' అనే వీడియో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో ద్వారా తనపై తప్పుడు ప్రచారం జరిగిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో ధ్రువ్‌ రాఠీకి పలుమార్లు సమన్లు జారీ అయ్యాయి. అనంతరం బెయిలబుల్‌ వారెంట్లు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆయన కోర్టుకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆస్ట్రియాలో నివసిస్తున్న ధ్రువ్‌ రాఠీకి నోటీసులు అందించడం కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన దేశంలో లేకపోవడం వల్లే విచారణ ఆలస్యమవుతోందని ఫిర్యాదుదారు తరఫు వాదన. ఈ నేపథ్యంలో కోర్టు తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

కేజ్రీవాల్‌ కూడా ఆ వీడియోను..

2018లో ఈ వీడియో రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. అప్పట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం ధ్రువ్‌ రాఠీ రూపొందించిన వీడియోను రీట్వీట్‌ చేశారు. అయితే ఈ వ్యవహారంపై అనంతరం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో ఆ వీడియోను షేర్‌ చేయడం తన పొరపాటేనని కేజ్రీవాల్‌ అంగీకరించడం గమనార్హం. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ పరువునష్టం కేసులో ధ్రువ్‌ రాఠీ కోర్టుకు హాజరుకాకపోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌తో ఈ కేసు విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Advertisement
Advertisement