త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి ద‌ళితులంటే చుల‌క‌న భావం : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

Motkupalli Narasimhulu | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ద‌ళితులంటే చుల‌క‌న భావం అని మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మండిప‌డ్డారు. ద‌ళితుల‌ను ఇంత చిన్న‌చూపు చూసిన ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Nov 23, 2026, 4.01 pm IST

Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి ద‌ళితులంటే చుల‌క‌న భావం : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు
Advertisement

Motkupalli Narasimhulu | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ద‌ళితులంటే చుల‌క‌న భావం అని మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మండిప‌డ్డారు. ద‌ళితుల‌ను ఇంత చిన్న‌చూపు చూసిన ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

బాధాక‌రం.. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్ర‌భుత్వాల‌ను చూశాను. మొన్న టీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్‌ను చూశాను. లెక్క‌లేని త‌నం, చుల‌క‌న భావంతో ద‌ళిత‌న‌లు చూసిన సంద‌ర్భం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలోనే క‌న‌బ‌డుతుంది. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగితే రివ్యూ చేసేది లేదు.. మాట్లాడేది లేదు. ఎవ‌రిని ఖాత‌రు చేయ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాయ‌నా రేవంత్ రెడ్డి మూడేండ్ల‌ది వ‌ద్దు ఈ ఒక్క నెల‌దే చూద్దాం.. ఈ వ‌న్ మంత్ లోప‌ల మొన్న పెద్ద‌ప‌ల్లిలో అక్షిత రాణిని రేప్ చేసి చంపారు. వాళ్ల‌కు ఏం ప‌నిష్‌మెంట్ ఇస్తారో.. దాని గురించి మాట్లాడ‌డం లేదు. అంట‌రానిత‌నం వారి గురించి నేను మాట్లాడ‌ను అన్న‌ట్టు సీఎం రేవంత్ ఉన్నారు. ఇది దుర‌దృష్ట‌క‌రం, బాధాక‌రం. చింత‌ప‌ల్లిలో మాదిగ అమ్మాయిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించి కొట్టారు. వారిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య తీసుకుంటుందో చెప్ప‌లేదు. దళితులను ఇంత చిన్నచూపు చూసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు అని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు.

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ న‌ల్ల‌గొండ జిల్లాను ఏలుతున్నారు..

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ న‌ల్ల‌గొండ జిల్లాను ఏలుతున్నారు.. సేవ చేసి కాదు పైస‌ల‌తో ఏలుతున్నారు. ఎవ‌నిదో దోసుకువ‌చ్చి.. ఆ డ‌బ్బును పంచి, అమాయ‌క‌పు ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే గెలుస్తున్నారు. చివ‌రికి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నా. మాదిగ జాతికి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వ్య‌తిరేకులు. వీరికి అనేక సంద‌ర్భాల్లో మాట సాయం చేశాను. సామేల్ గెల‌వ‌డు.. వీరేశం గెవ‌డు అని చెబుతున్నారు. మీరెవ‌రు చెప్ప‌డానికి పార్టీ అద్య‌క్షులా..? మీరు ఏమైనా.. టికెట్ ఇవ్వ‌గ‌లుగుతారా..? ద‌ళిత నాయ‌కుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నారు. మీరు యాంటీ మాదిగ‌. రాబోయే కాలంలో మిమ్మ‌ల్ని స‌హించేది లేదు అని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement