త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగ‌చైత‌న్య‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత

నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భ‌ర్త‌కు రొమాంటిక్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది శోభిత ధూళిపాళ‌. నాగ‌చైత‌న్య‌కు లిప్‌కిస్ ఇస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు "హ్యాపీ బ‌ర్త్‌డే ల‌వ‌ర్" అంటూ క్యాప్ష‌న్ జోడించింది.

N

News | Published On Nov 23, 2026, 3.42 pm IST

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగ‌చైత‌న్య‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత
Advertisement

Sobhita Dhulipala | నాగ‌చైత‌న్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భ‌ర్త‌కు రొమాంటిక్ విషెస్ చెప్పింది శోభిత ధూళిపాళ‌. లిప్‌కిస్ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోమ‌వారం నాటితో నాగ‌చైత‌న్య న‌ల‌భై ఏళ్ల‌లోకి అడుగుపెట్టారు. అత‌డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు విషెస్ చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు శోభిత ధూళిపాళ వెరైటీగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేసింది. భ‌ర్త‌కు లిప్‌కిస్ ఇస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "హ్యాపీ బ‌ర్త్‌డే ల‌వ‌ర్" అంటూ క్యాప్ష‌న్ జోడించింది.
శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. క్యూటెస్ట్ క‌పుల్ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. లిప్‌లాక్ ఫొటోల‌ను ప‌బ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల‌లో పోస్ట్ చేయ‌డం బాగాలేదంటూ మరికొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఫారిన్ టూర్‌...

షూటింగ్‌ల నుంచి గ్యాప్ దొరికితే నాగ‌చైత‌న్య‌, శోభిత ఫారిన్ టూర్ల‌కు వెళుతుంటారు. గ‌తంలో విహార‌యాత్ర కోసం సైప్ర‌స్‌కు వెళ్లిన టైమ్‌లో తీసుకున్న లిప్‌లాక్ ఫొటో ఇద‌ని  సమాచారం.

వృష‌క‌ర్మ‌....

ప్ర‌స్తుతం వృష‌క‌ర్మ ప్ర‌మోష‌న్స్‌తో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 4న రిలీజ్ కాబోతుంది. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు శోభిత ధూళిపాళ త‌మిళంలో వెట్టువ‌మ్ అనే సినిమా చేస్తోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో శోభిత క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement