Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి
Etala Rajendar | హైదరాబాద్‌లోని భూముల (Hyderabad Lands)ను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మనివ్వమని.. ప్రజావసరాలకే వినియోగించాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendar) డిమాండ్ చేశారు.
- కూకట్‌పల్లిలో వేల ఎకరాలు అమ్ముతుంటే ఎట్ల ఊకుంటున్నరు
- ఆట స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఆసుపత్రులకు కేటాయించాలి
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
Etala Rajendar | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని భూముల (Hyderabad Lands)ను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మనివ్వమని.. ప్రజావసరాలకే వినియోగించాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendar) డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు చెల్లించాలనుకుంటే సమీపంలోని ఐడియల్ భూములను విక్రయించాలని సూచించారు. కూకట్‌పల్లిలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించాలని, జూనియర్ కాలేజీలు, ఆసుపత్రులు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రేవంత్ రెడ్డిని తాను వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నానని అన్నారు. ఈ పరిధిలో వేల ఎకరాల భూములను విక్రయిస్తుంటే ఎలా అంగీకరిస్తున్నారని ప్రశ్నించారు. 333 ఎకరాల భూమి ఎకరాకు రూ.100 కోట్ల చొప్పున విక్రయిస్తే సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అంత విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోకుండా ఫీనిక్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కమీషన్లు ఢిల్లీకి పంపించే ప్రయత్నం జరుగుతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
డీఎల్ఎఫ్ సంస్థ కోసం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 19 ఎకరాల భూమిని కేటాయించి, ఆ తర్వాత రద్దు చేసిందని గుర్తుచేశారు. మెట్రో రైలు కోసం ఏడు ఎకరాలు కేటాయించారని తెలిపారు. మిగిలిన భూములను వేలం వేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. గండిపేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రజా అవసరాల కోసం వినియోగిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆట స్థలాలు ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌లో పిల్లలకు తగిన ఆట స్థలాలు లేకపోవడంతో పలువురు యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారనే వార్తలు వస్తున్నాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పార్కులు, ఆట స్థలాలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ప్రైవేట్ పార్కుల్లో చిన్నచిన్న నెట్స్ ఏర్పాటు చేసుకుని ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అమ్మడం కంటే ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఆటస్థలాలు, పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●Dhruv Rathee | ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
- ●Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత
- ●Eating Two Eggs A Day | నెల రోజుల పాటు రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
- ●Review on Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి
- ●Supreme Court | ‘బాహుబలి’లా ప్రవర్తించడం మానుకోండి.. సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Dhruv Rathee | ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత

Eating Two Eggs A Day | నెల రోజుల పాటు రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?






