త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadish Reddy | ప‌ల్నాడు ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం

Jagadish Reddy | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మంగా చేప‌ట్టిన ప‌ల్నాడు ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామ‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Nov 23, 2026, 3.05 pm IST

Jagadish Reddy | ప‌ల్నాడు ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం
Advertisement

కేంద్రానికి స‌మాచారం ఇవ్వ‌కుండానే ఏపీ గ్రిడ్ ప్రాజెక్ట్
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు మోసం చేస్తుండు
ఏపీకి స‌హ‌క‌రిస్తున్న తెలంగాణ నేత‌ల‌పై మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్

Jagadish Reddy | త్రినేత్ర న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మంగా చేప‌ట్టిన ప‌ల్నాడు ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామ‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. జ‌ల‌సౌధ‌లో కేఆర్ఎంబీ చైర్మ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి జ‌గ‌దీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేఆర్ఎంబీ, కేంద్రానికి సమాచారం లేకుండా ఏపీ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతుంది. కృష్ణా - గోదావరిలో ఏపీ తన వాటా కంటే ఎక్కువ వాడుకుంది. మూడు నెలల్లో 90 లక్షల మంది 9 టీఎంసీల మంచి నీళ్లు తాగుతారా? తెలంగాణ ప్రజలకు చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఏపీ దోచుకుపోతుంటే తెలంగాణ నాయకులు సహకరిస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇప్పటికే వేల టీఎంసీలు దోచుకుపోతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ నేతలు లొంగిపోయారు అని సూర్యాపేట ఎమ్మెల్యే విమ‌ర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేయకపోతే.. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. నల్గొండ జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి పోరాటం ఉధృతం చేస్తాం. బ్లాస్టింగ్‌లు జరుగుతుంటే ఇరిగేష‌న్ మంత్రి ఏం చేస్తున్నారు? 24 గంటల పాటు కమిషన్‌లు లెక్కపెట్టడంలో బిజీగా ఉన్నారా..? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన సీఎం ఎందుకు ప్రాజెక్టుపై మౌనంగా ఉన్నారు? మూడేళ్ళ నుంచి పొలాలు ఎండుతనే ఉన్నాయి ఎందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎండిన పొలాలు కనిపించకపోతే మాతో వస్తే చూపిస్తామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌లో నీళ్ల కష్టాలు తీవ్రమ‌య్యాయి : మాజీ మంత్రి స‌బిత 

మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంది. హైదరాబాద్‌లో నీళ్ల కష్టాలు తీవ్రమ‌య్యాయి. భవిష్యత్‌లో మంచినీటి సమస్య రావొద్దు అంటే ఏపీ అక్రమ ప్రాజెక్టుల‌ను ఆపాలి. కేసీఆర్ హయాంలో ఉన్న లైన్‌లలో నీళ్లు హైదరాబాద్‌లో రావడం లేదు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆపాలని స‌బితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

440 డెడ్ స్టోరేజ్‌లో పల్నాడుకు నీళ్లను తరలించే కుట్ర : ఎమ్మెల్సీ దాసోజు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాల మేరకు మరోసారి జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాకముందు తాటిచెట్టంత కాలువలు తొవ్వి శ్రీ శైలం నుంచి జల దోపిడికి పాల్పడ్డారు. బానిసకు ఒక బానిస అన్నట్లుగా ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ నాయకులు అడుగులకు మడుగులొత్తి పోతిరెడ్డిపాడు దోపిడీకి సహకరించారు. మరోసారి నాగార్జున సాగర్‌లో దోపిడి జరుగుతుంది. ఈ దోపిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తున్నాడు. పల్నాడు వాటర్ గ్రిడ్ నాగార్జున సాగర్ కుడి కాలువపై నిర్మిస్తున్నారు. 440 డెడ్ స్టోరేజ్‌లో పల్నాడుకు నీళ్లను తరలించే కుట్ర జరుగుతుంది. గుడ్డి గుర్రం పళ్ళు తోమినట్లుగా, దున్నపోతు మీద వాన పడినట్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించారు. హైదరాబాద్‌లో కోటిన్నర మంది ప్రజలు కృష్ణా నదిపై ఆధార‌ప‌డుతారు. హైదరాబాద్ నగరంలో రూ. 800 వాటర్ ట్యాంకర్ రూ. 2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలతో హాస్టల్స్, హోటళ్లు మూతపడుతున్నాయి. సాగునీటి ఇబ్బందులతో 25 లక్షల ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. అక్రమంగా పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కడుతుంటే ఈ ప్రభుత్వం ఏం పీకుతున్న‌ట్లు..? రాజకీయ స్వార్ధంతో చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు. రక్షకుడే భక్షుకుడు అయినట్లు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి భక్షుకుడు అయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే కేఆర్ఎంబీ సమావేశానికి రావాలి అని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

ఉమ్మడి పాలమూరు నష్టపోయింది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ కుడి కాలువపై పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. వాటర్ గ్రిడ్ పనులు దాదాపుగా 80 శాతం పూర్తి అయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం, తెలివ తక్కువ తనానికి నిదర్శనమే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్. ఈ ప్రభుత్వ తెలివి తక్కువతనంతో ఉమ్మడి పాలమూరు నష్టపోయింది. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులు వెంటనే ఆపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. గతంలో పోతిరెడ్డిపాడు విషయంలో ఇలానే జరిగి శ్రీ శైలంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. పైన కర్ణాటక, కింద‌ ఆంధ్రప్రదేశ్ రెండు రకాలుగా పాలమూరు నష్టం చేస్తున్నారు అని ల‌క్ష్మారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement