ASUS AiO VM441 | ఏఐ పవర్‌తో అసుస్ కొత్త ఏఐఓ పీసీ.. తొలి స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఆలిన్ వన్ డెస్క్‌టాప్..
ASUS AiO VM441 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్‌లో తన కొత్త అసుస్ వీఎం441 క్యుఏ ఏఐఓ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ పీసీని లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌తో వచ్చిన ఇండస్ట్రీలో తొలి ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ పీసీ ఇదేనని కంపెనీ తెలిపింది.
Technology | Published On May 25, 2026, 2.03 pm IST
ASUS AiO VM441 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్‌లో తన కొత్త అసుస్ వీఎం441 క్యుఏ ఏఐఓ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ పీసీని లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌తో వచ్చిన ఇండస్ట్రీలో తొలి ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ పీసీ ఇదేనని కంపెనీ తెలిపింది. కొత్త 24 ఇంచుల డివైస్‌ను హోమ్ యూజర్లు, కాంపాక్ట్ స్టూడియోలు, హైబ్రిడ్ వర్క్‌స్పేస్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కోపైలట్ ప్లస్ పీసీగా వచ్చిన ఈ మోడల్‌లో ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరుపై అసుస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ సిరీస్‌లో 512జీబీ, 1టీబీ పీసీఐఈ 4.0 ఎస్‌ఎస్‌డీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసుస్ వీఎం441 క్యుఏ ఏఐఓలో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో ఉన్న క్వాల్‌కామ్ హెక్సాగాన్ ఎన్‌పీయూ గరిష్ఠంగా 45 టాప్స్ వరకు ఏఐ పనితీరును అందిస్తుంది. కోపైలట్ ప్లస్ పీసీ కావడంతో లోకల్ ఏఐ వర్క్‌ఫ్లోలు, మల్టీటాస్కింగ్, రోజువారీ ప్రొడక్టివిటీ పనులను వేగంగా నిర్వహిస్తుంది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లు..
ఈ డివైస్‌లో 23.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు. అల్ట్రా స్లిమ్ చాసిస్‌తోపాటు 22ఎంఎం మెటాలిక్ స్టాండ్ అందించారు. ఎక్కువసేపు ఉపయోగించే యూజర్ల కోసం అడ్జస్టబుల్ టిల్ట్ మెకానిజం కూడా ఇచ్చారు. డిస్‌ప్లే ఫీచర్లలో 100 శాతం ఎస్‌ఆర్‌జీబీ కలర్ గామట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉన్నాయి. యాంటీ గ్లేర్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ప్యానెల్‌తోపాటు 88 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కంపెనీ అందించింది. హైబ్రిడ్ వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్యూయల్ 3 వాట్స్ స్టీరియో స్పీకర్లను బేస్-రిఫ్లెక్స్ డిజైన్‌తో ఇచ్చారు. డాల్బీ అట్మాస్ ట్యూనింగ్ కూడా ఇందులో ఉంది. వర్చువల్ కమ్యూనికేషన్ కోసం బిల్ట్-ఇన్ 5 మెగాపిక్సెల్ ఐఆర్ కెమెరా ఇచ్చారు. ఇది విండోస్ హలో ఫేషియల్ రికగ్నిషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫిజికల్ ప్రైవసీ షటర్ కూడా ఉంది. వీడియో కాల్స్ సమయంలో ఏఐ కెమెరా ఫీచర్లు వీడియో క్వాలిటీని మెరుగుపరుస్తాయి. ఏఐ ఆధారిత టూ-వే నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గిస్తుంది.
మైక్రోసాఫ్ట్ ఉచిత సేవలు..
క్లట్టర్-ఫ్రీ వర్క్‌స్టేషన్ కోసం బాక్స్‌లో వైర్‌లెస్ కీబోర్డ్, వైర్‌లెస్ మౌస్‌ను కంపెనీ అందిస్తోంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024 లైఫ్‌టైమ్ యాక్సెస్‌తో పాటు మైక్రోసాఫ్ట్ 365 బేసిక్‌కు ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇందులో 100జీబీ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ పీసీ విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ ఎడిషన్‌పై పనిచేస్తుంది. ఇందులో 16జీబీ ర్యామ్ ఇచ్చారు. గ్రాఫిక్స్ కోసం క్వాల్‌కామ్ అడ్రెనో జీపీయూ ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 సపోర్ట్ అందించారు. సైడ్ ఐఓ పోర్ట్స్‌లో యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-సీ, మైక్-ఇన్, హెడ్‌ఫోన్ అవుట్ ఉన్నాయి. రియర్ పోర్ట్స్‌లో యూఎస్‌బీ 2.0 టైప్-ఏ, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-ఏ, హెచ్‌డీఎంఐ అవుట్ 2.1బీ, ఆర్జే45 గిగాబిట్ ఈథర్‌నెట్, కెన్సింగ్టన్ లాక్, డీసీ-ఇన్ పోర్ట్ ఇచ్చారు.
ధర వివరాలు..
సెక్యూరిటీ కోసం ప్రైవసీ షటర్, ఫర్మ్‌వేర్ టీపీఎం అందించారు. సస్టైనబిలిటీ పరంగా 50 శాతం సస్టైనబుల్ మెటీరియల్స్ ఉపయోగించామని కంపెనీ తెలిపింది. రీచ్, రోహ్స్, ఎనర్జీ స్టార్ 9.0, ఈపీఏటీ గోల్డ్ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. అసుస్ వీఎం441 క్యుఏ ఏఐఓ 512జీబీ వేరియంట్ ధర రూ.1,01,990గా ఉంది. 1టీబీ వేరియంట్ ధర రూ.1,11,990గా ఉంది. ఈ డివైస్‌లు ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, క్రోమా, ఆర్ఓజీ స్టోర్లు, అథరైజ్డ్ రిటైల్ పార్ట్‌నర్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అసుస్ ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కంపెనీ ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. నెలకు రూ.5,666 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధరలు ఎంతంటే..?
సెప్టెంబర్ 17, 2026

ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
ఆగస్టు 21, 2026

ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్
- ●Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్

Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్



