Rafale Fighter Jets | భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు.. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్‌ను సిద్ధం చేసిన రక్షణ శాఖ
Rafale Fighter Jets | 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభ్యర్థన లేఖను (లెటర్ ఆఫ్ రిక్వెస్ట్) రక్షణ శాఖ తాజాగా సిద్ధం చేసింది. వచ్చే కొన్ని వారాల్లోనే దీనిని ఫ్రాన్స్‌కు పంపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
Rafale Fighter Jets | భారత వాయుసేన (IAF) అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు (Rafale Fighter Jets) చేరబోతున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) కొనుగోళ్లకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభ్యర్థన లేఖను (లెటర్ ఆఫ్ రిక్వెస్ట్) రక్షణ శాఖ తాజాగా సిద్ధం చేసింది. వచ్చే కొన్ని వారాల్లోనే దీనిని ఫ్రాన్స్‌కు పంపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఫ్రాన్స్ (France) ప్రభుత్వం ఈ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్‌కు స్పందించిన తర్వాత.. భారత్ అధికారికంగా 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్' (RFP) జారీ చేసి ఒప్పందాన్ని ఖరారు చేస్తుంది. దాదాపు రూ.3లక్షల 25వేల కోట్ల అంచనా వ్యయంతో జరగబోయే ఈ భారీ రక్షణ ఒప్పందం దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ డీల్‌గా నిలవనుంది.
ఫ్రెంచ్ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్ నుంచి 114 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో భాగంగా దాదాపు 90 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. మిగిలిన విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి ఎగిరివచ్చే స్థితిలో అందుతాయి.
ఈ విమానాల్లో భారతీయ సాంకేతికత వాటా దాదాపు 50 శాతంగా ఉండబోతోంది. ఇందుకు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ సహకరించనున్నది. హైదరాబాద్ కేంద్రంగా డసో సహకారంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) ఈ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు తయారు చేయనుంది. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం డసో సంస్థతో టాటా సంస్థ ఒప్పంద కూడా కుదుర్చుకుంది.
రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఇవి సత్తా చాటాయి. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 'స్కాల్ప్' క్రూయిజ్ క్షిపణులను ఈ ఆపరేషన్‌లో రఫేల్స్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ యుద్ధ విమానాలు మెటియోర్, హ్యామర్ వంటి శక్తిమంతమైన క్షిపణులను కూడా మోయగలవు. ప్రస్తుతం మన వైమానిక దళం వద్ద ప్రస్తుతం 36 రఫేల్స్ ఉన్నాయి. మరో 26 మెరైన్ వేరియంట్ల కోసం నేవీ ఆర్డర్ చేసింది. ఎం వర్షన్‌కు చెందిన ఆ యుద్ధ విమానాలను నౌకాదళం సుమారు 63 వేల కోట్లు ఖర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇవి త్వరలోనే నేవీలో చేరనున్నాయి.
Also Read..
ట్విషా మృతి కేసు దర్యాప్తు.. ఆ కథనాలు తీవ్రంగా కలచివేశాయి: సుప్రీంకోర్టు
అందుకే టీవీకేకి మద్దతిచ్చాం.. ఉదయనిధి వెన్నుపోటు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
తాజావార్తలు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి
- ●IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి






