CJI Surya Kant | సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదికి ధిక్కార నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
CJI Surya Kant | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రవీణ్ సింఘాల్ (advocate Praveen Singhal)పై సుప్రీంకోర్టు (Supreme Court) ధిక్కార నోటీసులు (Criminal Contempt) జారీ చేసింది. జనవరి 8 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
CJI Surya Kant | త్రినేత్ర న్యూస్ : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రవీణ్ సింఘాల్ (advocate Praveen Singhal)పై సుప్రీంకోర్టు (Supreme Court) ధిక్కార నోటీసులు (Criminal Contempt) జారీ చేసింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (Supreme Court Bar Association) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ మేరకు న్యాయవాది నుంచి స్పందన కోరుతూ నోటీసు జారీ చేసింది. జనవరి 8 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం జనవరి 20న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
సోమవారం మధ్యాహ్నం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాది తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. నవంబర్ 2న సీజేఐ కార్యాలయంలో తాను ఒక అంశాన్ని సమర్పించానని 15 రోజులైనా స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. అయితే, ముందస్తు అనుమతి లేకుండా కేసును ప్రస్తావించడాన్ని కోర్టు తప్పుబట్టింది. వెంటనే రిజిస్ట్రార్‌ను సంప్రదించి ఎర్లీ లిస్టింగ్ కోసం అభ్యర్థించాలని న్యాయవాదికి సూచించింది.
అయినప్పటికీ సదరు లాయర్ వినిపించుకోలేదు.. తన పిటిషన్ ఎందుకు లిస్ట్ కాలేదో తెలుసుకోవాలని పట్టుబట్టారు. స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని తానే స్వయంగా పరిశీలిస్తానని నిబంధనల ప్రకారం వేచి ఉండాలని సూచించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు న్యాయవాది సీజేఐపై వ్యక్తిగత విమర్శలు చేశారు. “లేదు నేను వేచి ఉండను. ఆ కుర్చీలో కూర్చోవడానికి మీకు అర్హత లేదు” అంటూ సీజేఐని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు న్యాయవాదిపై కోర్టు ధిక్కార (Criminal Contempt) చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిషన్ దాఖలు చేసింది.
Also Read..
కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి
పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. బర్డ్ ఫ్లూకు చెక్ పెట్టేలా తొలి స్వదేశీ వ్యాక్సిన్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
నవంబర్ 20, 2026

Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



