Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు
Bilkis Bano Case | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో (Bilkis Bano Case) జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. వారికి బాంబే హైకోర్టు విధించిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
Bilkis Bano Case | త్రినేత్ర న్యూస్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో (Bilkis Bano Case) జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు (Supreme Court) భారీ ఊరట కల్పించింది. వారికి దిగువ కోర్టు విధించిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. వారు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడాన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం.. దోషులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
2017 మే నెలలో బాంబే హైకోర్టు (Bombay High Court) తమ శిక్షను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును ఇద్దరు దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దోషుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దోషులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా కస్టడీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. దోషుల్లో ఒకరి పేరు తొలి ఎఫ్ఐఆర్‌లో లేదని చెప్పారు. ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని ఈ కేసులో చేర్చారని, బాధితురాలి వాంగ్మూలాల్లోనూ వీరి పేర్లు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, దోషుల్లో ఒకరు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నారని ధర్మాసనానికి తెలిపారు.
మరోవైపు నేరం అత్యంత తీవ్రమైనది కావడంతో పాటు ట్రయల్ కోర్టు, హైకోర్టులు అన్ని ఆధారాలను పరిశీలించే వారికి శిక్ష విధించాయని అదనపు సొలిసిటర్ జనరల్ రాజా థాక్రే వాదించారు. దోషులకు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అప్పీళ్లపై వాస్తవాలు, చట్టపరమైన అంశాలపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని స్పష్టం చేసింది. వీరిద్దరూ ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా, దోషుల్లో ఒకరైన జోషి తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్న అంశాన్ని కూడా కోర్టు గుర్తించింది. ఈ మేరకు సంబంధిత ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి వీరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇద్దరు దోషుల్ని వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
కాగా, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులగా నిర్ధారించింది. వారందరికీ 2008లో జీవిత ఖైదు విధించింది. వీరికి 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు విడుదల మంజూరు చేసింది. ఆ విడుదలను 2024లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో వారంతా తిరిగి జైలులకు వెళ్లాల్సి వచ్చింది.
Also Read..
భారత రక్షణ వ్యవస్థపై గూఢచర్య ముప్పు.. వైమానిక దళ అధిపతి కీలక హెచ్చరికలు
పవన్ బాటలో మరో మంత్రి.. విడాకుల ప్రకటన
E1, E2 హాస్టళ్లకు నీళ్లు, కరెంటు ఇచ్చేదాకా కదలం: ఉస్మానియా స్టూడెంట్స్
తాజావార్తలు
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం
- ●J&K Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం
- ●Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్

Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం






