Ashutosh Dixit | భారత రక్షణ వ్యవస్థపై గూఢచర్య ముప్పు.. వైమానిక దళ అధిపతి కీలక హెచ్చరికలు
Ashutosh Dixit | ప్రస్తుతం గూఢచర్యం అనేది కేవలం సోషల్ మీడియా హనీట్రాప్‌లకే (Honey Traps) పరిమితం కాలేదని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) ఆశుతోష్ దీక్షిత్ (Ashutosh Dixit) తెలిపారు. దేశ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న గూఢచర్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు సాంకేతిక, సంస్థాగత చర్యలను పటిష్టం చేసినట్లు చెప్పారు.
Ashutosh Dixit | త్రినేత్ర న్యూస్ : దేశ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న గూఢచర్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు సాంకేతిక, సంస్థాగత చర్యలను పటిష్టం చేసినట్లు భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) ఆశుతోష్ దీక్షిత్ (Ashutosh Dixit) తెలిపారు. విదేశీ గూఢచర్య సంస్థలు కేవలం హనీట్రాప్‌లే (Honey Traps) కాకుండా సైబర్ నిఘా, ఇతర రకాల ప్రలోభాల ద్వారా రక్షణ సిబ్బందిని వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0 సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం గూఢచర్యం అనేది కేవలం సోషల్ మీడియా హనీట్రాప్‌లకే పరిమితం కాలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. "ఇది కేవలం హనీట్రాప్ సమస్య మాత్రమే కాదు. ఇది ప్రధానంగా సైబర్ గూఢచర్యానికి సంబంధించిన అంశం. నేడు గూఢచర్యం అనేది సైబర్ మార్గాలు, రకరకాల ప్రలోభాల ద్వారా జరుగుతోంది. మొత్తంగా చూస్తే హనీట్రాప్ అనేది అందులో ఒక భాగం మాత్రమే" అని దీక్షిత్ వివరించారు.
సున్నితమైన సమాచారాన్ని రాబట్టడానికి శత్రు సంస్థలు సైబర్ దాడులు, ఆర్థిక ఎరలు వేస్తున్నాయని తెలిపారు. రక్షణ సిబ్బందిని బలహీనపరిచేందుకు మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) స్కీమ్‌లు, అధిక వడ్డీలకు అప్పులిచ్చే లోన్ షార్క్‌ల వంటి మార్గాలను కూడా విదేశీ సంస్థలు వాడుకుంటున్నాయని ఆయన హెచ్చరించారు. అయితే, భారత సైనిక నెట్‌వర్క్‌లు బాహ్య ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా 'ఎయిర్-గ్యాప్డ్' విధానంలో పనిచేస్తాయని చెప్పారు. దీనివల్ల బయటి నుంచి ఎవరూ సైబర్ దాడి చేయడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. కానీ, వ్యవస్థలోపలి నుంచి వచ్చే ముప్పుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోందన్నారు. దీనిపై నిఘా సంస్థలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని తెలిపారు.
ఈ ముప్పు కేవలం రక్షణ రంగానికే కాకుండా డీఆర్‌డీఓ (DRDO) వంటి ప్రభుత్వ పరిశోధన సంస్థలు, ప్రైవేట్ రక్షణ కాంట్రాక్టర్లకు కూడా పొంచి ఉందని హెచ్చరించారు. ప్రైవేట్ రక్షణ సంస్థలు సరైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నెట్‌వర్క్ భద్రతపై ప్రత్యేక ఏజెన్సీ ఇచ్చే సలహాలను ప్రైవేట్ సంస్థలు పాటిస్తే గూఢచర్య ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
మరోవైపు నిజమైన ఆత్మనిర్భరత కేవలం పారిశ్రామికోత్పత్తితో కాకుండా, నేరుగా యుద్ధ సన్నద్ధతతో ముడిపడి ఉందని చీఫ్ మార్షల్ అశుతోశ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అనేది కేవలం ఒక నినాదం కాదని, అది యుద్ధ సన్నద్ధతకు అసలైన పునాది అని స్పష్టం చేశారు. భవిష్యత్ యుద్ధాల్లో సోర్స్ కోడ్, విడిభాగాలు, ఆయుధాలు, డేటా లింకులు, ఇంజిన్ల కోసం ఇతర దేశాల నిర్ణయాలపై ఆధారపడటం ఏమాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో వేరొకరు భారత్ సామర్థ్యాలను నిలువరించలేరని స్పష్టం చేశారు. భవిష్యత్ యుద్ధాల కోసం భారత వైమానిక దళం రూపొందించిన వాయు (VAYU) విజన్ గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Also Read..
పవన్ బాటలో మరో మంత్రి.. విడాకుల ప్రకటన
బతికిపోయా.. వరుస బెదిరింపుల వేళ అర్ధరాత్రి అమితాబ్ ఆసక్తికర పోస్ట్
7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్.. అగ్నిప్రమాద ముప్పుపై హెచ్చరిక..
సంబంధిత వార్తలు

DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
అక్టోబర్ 6, 2026

Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోకు సహకరించండి.. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 2, 2026

DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు
- ●Ramchandar Rao | భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?
- ●Varanasi Movie | "వారణాసి"కి గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి - అప్డేట్తో పోస్ట్‌పోన్ రూమర్లకు పుల్‌స్టాప్
- ●Osmania Students Protest | E1, E2 హాస్టళ్లకు నీళ్లు, కరెంటు ఇచ్చేదాకా కదలం: ఉస్మానియా స్టూడెంట్స్
- ●Megha Shetty | ఆది సాయికుమార్ "అరుంధతి నక్షత్రం" - టాలీవుడ్లోకి మరో కన్నడ బ్యూటీ
- ●CIET-NCERT Online Training 2026| డిజిటల్ యుగంలో సరికొత్త బోధనా పద్ధతులు.. AI, గేమిఫికేషన్పై ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్

Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు

Ramchandar Rao | భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?

Varanasi Movie | "వారణాసి"కి గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి - అప్డేట్తో పోస్ట్‌పోన్ రూమర్లకు పుల్‌స్టాప్

Osmania Students Protest | E1, E2 హాస్టళ్లకు నీళ్లు, కరెంటు ఇచ్చేదాకా కదలం: ఉస్మానియా స్టూడెంట్స్



