త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divorce | ప‌వ‌న్ బాట‌లో మ‌రో మంత్రి.. విడాకుల ప్ర‌క‌ట‌న‌

Divorce | త‌మిళ‌నాడు మంత్రి ఆధ‌వ్‌ అర్జున (Aadhav Arjuna), ఆయ‌న భార్య డైసీ మార్టిన్ (Daisy Martin) తమ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

D

National | Published On Nov 16, 2026, 1.38 pm IST

Divorce | ప‌వ‌న్ బాట‌లో మ‌రో మంత్రి.. విడాకుల ప్ర‌క‌ట‌న‌
Advertisement

Divorce | త్రినేత్ర న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌లే విడాకులు (Divorce) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌న భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) 13 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు. తాజాగా ప‌వ‌న్ బాట‌లోనే మ‌రో మంత్రి విడాకుల ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళ‌నాడు మంత్రి ఆధ‌వ్‌ అర్జున (Aadhav Arjuna), ఆయ‌న భార్య డైసీ మార్టిన్ (Daisy Martin) తమ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

తాము విడాకులు తీసుకుంటున్న‌ట్లు డైసీ త‌న ఇన్‌స్టాఖాతాలో అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గత 14 ఏళ్లుగా త‌మ వైవాహిక జీవితం ప్రేమ, అవగాహన, మార్పులతో సాగింద‌ని తెలిపారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను చూశామ‌ని చెప్పారు. అన్ని దశలను స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా కలిసి అధిగమించామ‌ని చెప్పుకొచ్చారు. ఇద్ద‌రం పరస్పర అంగీకారంతో జంటగా విడిపోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వివాహ బంధం ముగిసినప్పటికీ తామిద్ద‌రం మంచి స్నేహితులుగా కొనసాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ బిడ్డ సంర‌క్ష‌ణకు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని తెలిపారు.

త‌మ కుమార్తె భ‌విష్య‌త్తు కోసం త‌ల్లిదండ్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆధ‌వ్‌ అర్జున పట్ల తనకు ఎప్పటికీ గౌరవం తగ్గదని డైసీ పేర్కొన్నారు. ఆయ‌న భ‌విష్య‌త్తులో మ‌రింత సంతోషంగా, విజ‌య‌వంతమైన జీవితం గ‌డ‌పాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ క్లిష్ట‌ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ఈ నిర్ణ‌యాన్ని అభిమానులు, మీడియా అర్థం చేసుకుని స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఆధ‌వ్ అర్జున ప్ర‌స్తుతం విజ‌య్ టీవీకే ప్ర‌భుత్వంలో కీల‌క నేత‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక డైసీ మార్టిన్‌తో ఆధ‌వ్ అర్జున‌కు 2012లో వివాహ‌మైంది. డైసీ ప్రముఖ వ్యాపారవేత్త లాటరీ కింగ్ గా ప్రసిద్ధి చెందిన శాంటియాగో మార్టిన్ కుమార్తె. ఆధ‌వ్‌-డైసీ దంప‌తుల‌కు ఒక కుమార్తె కూడా ఉంది. డైసీ ప్రస్తుతం ఏరీస్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు.

Also Read..

బ‌తికిపోయా.. వ‌రుస బెదిరింపుల వేళ‌ అర్ధ‌రాత్రి అమితాబ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

స‌చిన్‌తో గ‌ల్లీ క్రికెట్ ఆడిన బ్రిట‌న్ యువ‌రాజు విలియ‌మ్స్‌.. ముంబై వీధుల్లో రోమింగ్‌

అక్టోబర్‌లో జియో, ఎయిర్‌టెల్ షేర్లపై మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు.. బ్యాంకింగ్ షేర్ల‌కు బైబై..

Advertisement
Advertisement